Ind vs NZ: కష్టాల్లో టీమిండియా.. 30 పరుగులకే మూడు వికెట్లు డౌన్..!
ABN, Publish Date - Mar 02 , 2025 | 03:31 PM
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా తడబడుతోంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది.
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో భాగంగా జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా తడబడుతోంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (Ind vs NZ) స్వల్ప స్కోరుకే టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. పిచ్ స్వింగ్‌కు అనుకూలిస్తుండడంతో కివీస్ బౌలర్లు చెలరేగారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (2)ను మ్యాట్ హెన్రీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు
దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ (15) జేమీసన్ షార్ట్ పిచ్ బంతికి క్యాచ్ అవుటై వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ప్రస్తుతం 12 ఓవర్లలో 41 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్ (9 బ్యాటింగ్), అక్షర్ పటేల్ (3 బ్యాటింగ్) ఉన్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ రెండు వికెట్లు, జేమీసన్ ఒక వికెట్ పడగొట్టారు.
గ్రూప్-ఏలో భాగంగా జరుగుతున్న ఈ చివరి లీగ్ మ్యాచ్ సెమీస్‌లో ఏయే జట్లు తలపడబోతున్నాయే తేల్చేస్తుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఓడిన జట్టు దక్షిణాఫ్రికాతో సెమీస్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-ఏ నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు, గ్రూప్-బి నుంచి అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ జట్లు ఇంటి దారి పట్టాయి.
ఇవి కూడా చదవండి..
SA vs Eng: సెమీస్‌కు దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్‌పై సునాయాస విజయం..
SA vs Eng: చేతులెత్తేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా టార్గెట్ 180..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 02 , 2025 | 03:31 PM