SA vs Eng: సెమీస్‌కు దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్‌పై సునాయాస విజయం..
ABN, Publish Date - Mar 01 , 2025 | 08:47 PM
అన్ని విభాగాల్లోనూ రాణించిన దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌పై సునాయాసంగా విజయం సాధించింది. స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్‌ను కట్టిడి చేసి 29.1 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి గౌరవప్రదంగా ఛాంపియన్స్ ట్రోఫీకి వీడ్కోలు పలుకుదామనుకున్న ఇంగ్లండ్‌కు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. అన్ని విభాగాల్లోనూ రాణించి ఇంగ్లండ్‌పై సునాయాసంగా విజయం సాధించింది. స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్‌ను కట్టిడి చేసి 29.1 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను దక్షిణాఫ్రికా బౌలర్లు బెంబేలెత్తించారు. 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ చేశారు (Champions Trophy 2025).
దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సన్ విజృంభించడంతో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. ఫిల్ సాల్ట్ (8), జేమీ స్మిత్ (0), ఓపెనర్ బెనె డకెట్ (24)లను జాన్సన్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత జో రూట్ (37), హ్యారీ బ్రూక్ (19)తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఆ తర్వాత రూట్, బ్రూక్ స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. జాస్ బట్లర్ (21), జోఫ్రా ఆర్చర్ (25) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. మిగిలిన వారు పెద్దగా రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్, ముల్దర్ మూడేసి వికెట్లు తీశారు. కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఎంగిడి, రబాడా ఒక్కో వికెట్ పడగొట్టారు.
అనంతరం దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. డస్సెన్ (72 నాటౌట్), క్లాసెన్ (64) రాణించడంతో మూడు వికెట్లు కోల్పోయి 29.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రికెల్టన్ (27) కూడా రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టగా, రషీద్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన దక్షిణాఫ్రికా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేరుకోగా ఇంగ్లండ్, అఫ్గాన్ ఇంటి దారి పట్టాయి.
ఇవి కూడా చదవండి..
ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు
రోహిత్‌తో పాటు అతడు మిస్.. ప్లేయింగ్ 11 ఇదే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 01 , 2025 | 09:10 PM