Tennis : ఆస్ట్రేలియన్ ఓపెన్
ABN, Publish Date - Jan 13 , 2025 | 03:10 AM
డిఫెండింగ్ చాంప్ అర్యానా సబలెంక, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేశారు.
సబలెంక, జ్వెరెవ్ శుభారంభం
మెల్‌బోర్న్: డిఫెండింగ్ చాంప్ అర్యానా సబలెంక, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సబలెంక 6-3, 6-2తో స్లోన్ స్టీఫెన్స్‌పై అలవోకగా నెగ్గింది. చైనా ప్లేయర్ క్వినెన్ జాంగ్ 7-6(3), 6-1తో అంకా తొడోనిను, 11వ సీడ్ పౌలా బడోసా 6-3, 7-6(5)తో వాంగ్ జిన్‌ను, ఆండ్రీవ 6-3, 6-3తో బజ్కోవాను, డోనా వెకిక్ 6-4, 6-4తో డయానిను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకొన్నారు. పురుషుల్లో జ్వెరెవ్ 6-4, 6-4, 6-4తో లూకాస్‌పై, ఆరో సీడ్ కాస్పర్ రూడ్ 6-3, 1-6, 7-5, 2-6, 6-1తో మునార్‌పై గెలిచి నెగ్గారు.
నగాల్‌కు నిరాశ: భారత ఆటగాడు సుమీత్ నగాల్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. 26వ సీడ్ థామస్ మచాక్‌తో పోరులో నగాల్ 3-6, 1-6, 5-7తో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు.
Updated Date - Jan 13 , 2025 | 03:13 AM