Boy Stunt Video: ఈ కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. సైకిల్‌తో కళ్లు చెదిరే స్టంట్ చూస్తే..
ABN, Publish Date - Mar 10 , 2025 | 03:10 PM
మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తుల ప్రతిభను కూడా సోషల్ మీడియా అందరికీ చేరవేస్తోంది. సోషల్ మీడియా ద్వారానే ఎంతో మంది ప్రాచుర్యం సంపాదించారు. అమోఘమైన ట్యాలెంట్ బయటపడింది. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎవరికి ఎలాంటి ట్యాలంట్ ఉన్నా అది సోషల్ మీడియా ద్వారా అందర్నీ చేరిపోతోంది. మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తుల ప్రతిభను కూడా సోషల్ మీడియా అందరికీ చేరవేస్తోంది. సోషల్ మీడియా ద్వారానే ఎంతో మంది ప్రాచుర్యం సంపాదించారు. అమోఘమైన ట్యాలెంట్ బయటపడింది. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ కుర్రాడు సైకిల్‌తో చేసిన విన్యాసాలు నెటిజన్లను అబ్బురపరుస్తున్నాయి (Boy Stunt with Bicycle).
@purkharam36 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు మీద పడి ఉన్న సైకిల్‌తో ఓ కుర్రాడు అమోఘమైన స్టంట్ ప్రదర్శించాడు. రోడ్డు మీద పడి ఉన్న సైకిల్‌ను చేతులతో పట్టుకోకుండా పైకి లేపాడు. అలాగే సైకిల్‌ను 360 డిగ్రీలలో అతి వేగంగా తిప్పాడు. సైకిల్ పెడల్స్, హ్యాండిల్ మీదకు మారుతూ చుట్టు ఉన్న వారిని ఆకట్టుకున్నాడు. ఓ వ్యక్తి ఆ కుర్రాడి స్టంట్‌ను సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ కుర్రాడి ట్యాలెంట్ అద్భుతం అని, ఆ కుర్రాడు మెదడు చాలా షార్ప్‌గా పని చేస్తోందని, అమోఘమైన స్కిల్స్ ఆ కుర్రాడికి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ కళ్లకు శక్తి ఉంటే.. ఈ ఫొటోలో దాక్కున్న కుక్కను 5 సెకెన్లలో కనుక్కోండి..
China Viral News: విమానంలో నాకు సూది గుచ్చుకుంది.. నష్ట పరిహారం ఇవ్వండి.. ఎయిర్‌లైన్స్‌పై దావా..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 10 , 2025 | 03:10 PM