ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేల పగోడాలు ఒకేచోట..

ABN, Publish Date - Mar 09 , 2025 | 12:25 PM

చ్యాచ్యూ పగోడా... మయన్మార్‌లోని షాన్‌ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ టూరిస్టు ప్రదేశం. ఇది కూడా మన అమరావతి, నాగార్జున కొండలా ఓ పేద్ద బౌద్ధ స్థూపం అనుకుంటే పొరపాటే. చ్యాచ్యూ దాదాపు మూడు వేల బౌద్ధ స్థూపాల సముదాయం.ఆనాడు అశోకుడి పిలుపు మేరకు దక్షిణాసియా అంతా స్థూపాలను నిర్మించారు.

పంట చేతికొచ్చింది... ఇక పండగ చేసుకోవాలి.... అంతకంటే ముందు చక్కటి పంటను ప్రసాదించిన ఆ బుద్ధ భగవానుడికి నివేదన చేయాలి. ఇదే సంకల్పంతో వేల ఎడ్లబండ్ల మీద ధాన్యాన్ని వేసుకుని ఇంటిల్లిపాదీ బయల్దేరుతారు. ఇదే మయన్మార్‌లోని చ్యాచ్యూ పగోడా పండగ.

చ్యాచ్యూ పగోడా... మయన్మార్‌లోని షాన్‌ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ టూరిస్టు ప్రదేశం. ఇది కూడా మన అమరావతి, నాగార్జున కొండలా ఓ పేద్ద బౌద్ధ స్థూపం అనుకుంటే పొరపాటే. చ్యాచ్యూ దాదాపు మూడు వేల బౌద్ధ స్థూపాల సముదాయం.ఆనాడు అశోకుడి పిలుపు మేరకు దక్షిణాసియా అంతా స్థూపాలను నిర్మించారు. అలా చ్యాచ్యూలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు స్తూప నిర్మాణం జరిగింది. అయితే ఈ స్థూపాలన్నీ చిన్నవి.దాదాపు అన్ని లేత గోధుమ రంగులో ఉంటాయి. అన్నింటిలో బుద్ధ భగవానుడి విగ్రహం ఉంటుంది. ఈ చిన్న స్థూపాల మధ్యలో పెద్ద స్థూపం మాత్రం 40 మీటర్ల ఎత్తుతో తెలుపు రంగులో ఆకట్టుకుంటుంది. స్థూపాలనే మయన్మార్‌లో పగోడాలుగా పిలుస్తారు.


షాన్‌ రాష్ట్రంలోని మూల వాసుల్లో ‘పాహో’ తెగవాళ్లు ముఖ్యులు. బౌద్ధాన్ని అనుసరించే వీరికి చ్యాచ్యూ పగోడా ఎంతో పవిత్రమైనది. పంట చేతికి వచ్చిన తరవాత ఈ పగోడా దగ్గర పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకుంటారు. బుద్ధ భగవానుడికి అర్పించేందుకు ధాన్యం బస్తాలను ఎడ్ల బళ్ల మీద వేసుకుని కుటుంబ సమేతంగా పగోడా దగ్గరికి వస్తారు. ఈ సమయంలో రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల్లోని పాహో తెగవారందరూ ఇక్కడికి రావడం విశేషం.వాళ్లందరూ ఇక్కడే మూడు రోజులు గడుపుతారు. దేవుడికి నివేదనలు సమర్పించి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఆటపాటలతో సమయాన్ని గడుపుతారు. ఏడాదికి ఒక్కసారి తమ తెగవారినందరినీ కలుసుకోవడానికి గొప్ప సందర్భంగా భావిస్తారు. అలాగే ధాన్యరాశులు, తినుబండారాలు, హస్తకళలు, నేత వస్త్రాలు తదితరాలను టూరిస్టులకు అమ్మేందుకు మార్కెట్‌గా కూడా ఈ ప్రదేశాన్ని వినియోగించుకుంటారు.ఇదే చ్యాచ్యూ పగోడా పండగగా పేరుతెచ్చుకుంది.


అయితే చ్యాచ్యూ పగోడాకు వెళ్లడం ఓ సాహసమే.ప్రజారవాణా అంతగా ఉండదు.ప్రసిద్ధ ఇన్లే సరస్సుకి ఆగ్నేయంగా ఉన్న కొండల్లో చ్యాచ్యూ పగోడా ఉంది. త్వాంగ్గీ నగరానికి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న చ్యాచ్యూకి చేరడానికి కొద్ది దూరం వాహనంలో,మరి కాసేపు నడక దారిలో వెళ్లాలి. ఎంత లేదన్నా అయిదు గంటల ప్రయాణం. ఈ ప్రయాణం కాస్త విసుగును కలిగిస్తుంది. పగోడా సముదాయాన్ని చేరగానే ప్రకృతి రమణీయత మనస్సును ఉల్లాస పరుస్తుంది.అందుకేనేమో చ్యాచ్యూ పగోడా గురించి బయటి ప్రపంచానికి 2002లోనే తెలిసిందట. అప్పటి నుంచి మార్చి నెలలోని పౌర్ణమి రోజున వచ్చే చ్యాచ్యూ పండగకు టూరిస్టుల రాక ఎక్కువైంది. అది రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గట్లేదు.

Updated Date - Mar 09 , 2025 | 12:25 PM