Viral: బ్రేక్‌ఫాస్ట్‌లో చిన్న మార్పుతో రూ.83 లక్షలు పొదుపు చేసిన యువతి
ABN, Publish Date - Feb 19 , 2025 | 06:14 PM
40 ఏళ్లకే రిటైర్ కావాలనుకున్న ఓ యువతి భారీగా పొదుపు చేయడం ప్రారంభించింది. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో కేవలం కోడి గుడ్లు, బ్రెడ్ మాత్రమే తింటూ 24 ఏళ్ల వయసు వచ్చేసరికే ఏకంగా రూ.83 లక్షలు కూడబెట్టగలిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎంత సంపాదిస్తున్నా చాలట్లేదని బాధపడే వారు కొందరైతే ఉన్న దాంట్లోనే వీలైనంత ఎక్కువగా పొదపు చేసే వారు కొందరు. త్వరగా రిటైర్ కావాలనుకునే కొందరు ఊహించని రీతిలో పొదుపు పద్ధతులను పాటిస్తూ భారీగా డబ్బు కూడబెడుతున్నారు. ఇందుకు సంబంధించి ఓ మహిళ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు నోరెళ్ల బెట్టెలా చేస్తోంది (Viral).
ముసలితనం వరకూ పని చేయకుండా వీలైనంత త్వరగా రిటైర్ కావాలనేది పాశ్చాత్యుల్లో అనేక మంది ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం. ఇలాంటి వారు పాటించే పొదుపు విధానాల్ని చూస్తే మతి పోక తప్పదు.మియా మెక్‌గ్రాత్ అనే యువతిది సరిగ్గా ఇదే విధానం. ఫ్యాషన్ రంగంలో ఉన్నా కూడా ఆమె ఖర్చులను వీలైనంత తగ్గించుకుని ఏకంగా రూ.83 లక్షలు పొదుపు చేసుకుంది. 24 ఏళ్ల వియా ఓ ఫ్యాషన్ సంస్థలో అకౌంట్స్ మేనేజర్. కానీ ఆ రంగం పెడపోకడలేవీ ఆమె తన మీద పడనీయలేదు. వీలైనంత త్వరగా రిటైర్ కావాలనే లక్ష్యంతో ఆమె భారీస్థాయిలో ఖర్చులకు కత్తెర వేయడం ప్రారంభించింది.
Divorce Over Kids Surname: పిల్లలకు తన ఇంటి పేరు పెట్టుకోనివ్వలేదని భార్యకు విడాకులు
ఖరీదైన దుస్తులు, మేకప్ సామగ్రి వంటి వాటిని దూరం పెట్టింది. ఇందుకు బదులుగా సెకెండ్ హ్యాండ్ దుస్తులు ధరిస్తుంది. అంతేకాకుండా, బ్రేక్‌ఫాస్ట్ విషయంలోనూ ఇదే సూత్రాన్ని అనుసరించింది. ఉదయం అల్పాహారం బయట తినే బదులు ఇంట్లోనే అదీ కేవలం బ్రెడ్, కోడి గుడ్లతో మాత్రమే తినేది. అద్దె ఇంట్లో ఉంటే ఖర్చులు పెరుగుతాయని తల్లిదండ్రుల వద్దే ఉండటం ప్రారంభించింది. ఇంటిలో వండుకున్న ఆహారంతో పాటు వాటర్ బాటిల్‌లో నీళ్లు నింపుకుని ఆఫీసుకు తీసుకెళ్లేంది. ఆఫీసు కాంటీన్‌లో ఫుడ్, మంచినీళ్లు లేదా ఇతర పానీయాలు అస్సలు కొనుగోలు చేయదు.
Jhansi: అమ్మను నాన్నే చంపాడు..బొమ్మ వేసి మరీ చెప్పిన నాలుగేళ్ల చిన్నారి!
ఇలా అడుగడుగా ఖర్చులకు కత్తెర వేసిన ఆమె ఇప్పటివరకూ ఏకంగా రూ.83 లక్షలు పొదుపు చేసింది. కానీ 40 ఏళ్లు వచ్చేసరికి రూ.11 కోట్లు పొదుపు చేయాలనేది ఆమె లక్ష్యం. తన ముందు సుదీర్ఘ ప్రయాణం ఉందని చెబుతున్న ఆమె మరిన్ని పొదుపు చర్యలు చేపడతానని కూడా చెబుతోంది.
సరిగ్గా ఇదే పొదుపు మంత్రం ఫాలో అయిన ఓ అమెరికన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన శేషజీవితానికి కావాల్సినంత డబ్బు కూడబెట్టుకుని ఇటీవలే 40 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యాడు. అయితే, విపరీత పొదుపు కారణంగా చిన్న చిన్న ఆనందాలకు దూరం కావాల్సి వచ్చిందని ఇటీవల విచారం వ్యక్తం చేశాడు.
Updated Date - Feb 19 , 2025 | 06:14 PM