ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రంగుల మాయ..

ABN, Publish Date - Feb 02 , 2025 | 08:38 AM

ముదురు గులాబీ రంగు కొండలు ఎక్కడున్నాయని వెతకడం మొదలు పెట్టేశారా? కాస్త ఆగండి. ఇది కెమెరా చేసిన మాయ. మామూలు కెమెరాల్లో ఇలాంటి ఫొటోలు రావాలంటే కాస్త కష్టమే. ఇదంతా ఇన్‌ఫ్రా చేసిన మహేంద్రజాలం.

ముదురు గులాబీ రంగు కొండలు ఎక్కడున్నాయని వెతకడం మొదలు పెట్టేశారా? కాస్త ఆగండి. ఇది కెమెరా చేసిన మాయ. మామూలు కెమెరాల్లో ఇలాంటి ఫొటోలు రావాలంటే కాస్త కష్టమే. ఇదంతా ఇన్‌ఫ్రా చేసిన మహేంద్రజాలం. మనకు కనిపించే కాంతి తరంగాలతో కాకుండా ఇన్‌ఫ్రా రెడ్‌ ఫిల్మ్‌ లేదా ఫిల్డర్స్‌తో తీసిన ప్రత్యేక ఫొటోలివి. ఇన్‌ఫ్రారెడ్‌, అల్ట్రావయొలెట్‌ ఫొటోగ్రఫీకి సంబంధించిన పరికరాలను తయారుచేసే సంస్థ కొలారి. ఈ సంస్థ 2024కి గాను ‘లైఫ్‌ ఇన్‌ అనదర్‌ లైట్‌’తో ఇన్‌ఫ్రారెడ్‌ ఫొటోగ్రఫీ పొటీలు నిర్వహించి, ఫలితాలను వెల్లడించింది.


ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మంది మొత్తం పన్నెండు కేటగిరీలలో పాల్గొన్నారు. అందులో బహుమతులు పొందినవే ఇవి. ‘మా ఈ పోటీ కేవలం ఫొటోలు తీయడం కాదు, ప్రపంచాన్ని సరికొత్త దృక్కోణంలో చూడడం. ఇన్‌ఫ్రారెడ్‌లో ప్రపంచం ఎలా కనబడుతోంది. ఈ కిరణాల్లో కూడా మారనివి ఏవి? తదితరాలను తెలుసుకోవాలన్నదే మా ప్రయత్నం’ అంటున్నారు నిర్వాహకులు.

Updated Date - Feb 02 , 2025 | 08:38 AM