Viral: మరో 3 నిమిషాలు ఆగితే మరో రైలు వస్తుందని కద తల్లీ! ఎందుకింత తొందర!?
ABN, Publish Date - Feb 04 , 2025 | 08:14 PM
సింగపూర్‌లో ఓ మహిళ కదులుతున్న రైలును ఎక్కేందుకు చేసిన ప్రయత్నంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రైలు లేదా బస్సు కదులుతుండగా లోపలికెళ్లే జనాల గురించి మనకు తెలిసిందే. కదులుతున్న వాహనంలోకి ఎక్కేందుకు ప్రయత్నించడం ప్రమాదమని తెలిసీ ప్రాణాలకు తెగిస్తుంటారు. అయితే, సింగపూర్‌లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనాలు మహిళపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఎందుకంత తొందర అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతున్న ఈ వీడియో పూర్తి వివరాల్లోకి వెళితే...
Viral: రూ.2300 పెట్టి డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుంటే ఇదా చేసేది.. నెట్టింట పేషెంట్ ఆవేదన
స్థానికంగా ఉన్న బే ఎమ్‌ఆర్‌టీ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెడిట్ వేదికగా ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రైలు బయలుదేరుతుండగా ఆటోమేటిక్ తలుపులు మూసుకోవడం ప్రారంభించాయి. అయితే, ఓ మహిళ సరిగ్గా అదే సమయంలో రైల్లోకి వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేసింది. తలుపులు మూసుకోకుండా ఆపేందుకు తన చేతి కర్రను తలుపుల మధ్య అడ్డంగా పెట్టింది. అయినా కూడా, క్షణకాలం పాటు తలుపులు తెరుచుకుకోకపోవడంతో మహిళ కాస్త కంగారు పడింది. రైల్లో ఉన్న ఓ ప్రయాణికుడు ఆమె పరిస్థితిని గమనించి తలుపులను చేతులతో తెరిచే ప్రయత్నం చేశారు. ప్లాట్‌ఫాంపై ఉన్న మరో వ్యక్తి ఆమెకు సాయపడేందుకు ముందుకు వచ్చాడు. అదే సమయంలో తలుపులు మళ్లీ తెరుచుకోగలగడంతో ఆమె చివరకు లోపల కాలుపెట్టగలిగింది.
Trigger Fish Lips: ఈ పెదాలు ఎవరివో తెలిస్తే షాకైపోవాల్సిందే..
ఇక ఈ వీడియో చూసిన జనాలందరూ సదరు మహిళపై విమర్శలు గుప్పించారు. ‘‘ఈ రైలు కాకపోతే మరో రైలు.. కాసేపు ఆగితే తప్పేముంది. మరో మూడు నిమిషాల్లో లేకపోతే ఆరు నిమిషాల్లో ఇంకో రైలు వస్తుందిగా’’ అని కామెంట్ చేశారు. ‘‘అసలు జనాలకు నిబంధనలు పాటించడం ఎందుకంత కష్టమో నాకు అర్థం కాదు. నాకు తెలిసి రైల్లో ఉన్న వ్యక్తితో పాటు ఆమె వచ్చిందనుకుంటా’’ అని మరో వ్యక్తి అన్నాడు. ఇలాంటి పని చేసినందుకు మహిళపై జరిమానా విధించాలని కొందరు డిమాండ్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
కాగా, భారత్‌లో ఇటీవల వెలుగు చూసిన ఓ ఘటన ఓ జంట ఆర్టీసీ బస్సులు సీటు సంపాదించేందుకు నానా కష్టాలు పడింది. బస్సు తలుపు వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ వ్యక్తి తనతో పాటు వచ్చిన మహిళలను పైకెత్తి వెనక సీటు కటికిలోంచి లోపలికి తోశాడు. ఆ తరువాత తనూ అదే రీతిలో ఎక్కి కూర్చొన్నాడు. ఈ స్టంట్‌పై అప్పట్లో రకరకాల కామెంట్స్ వినిపించాయి.
Updated Date - Feb 04 , 2025 | 08:14 PM