Pakistan: సింహంతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. టిక్‌టాక్ వీడియో కోసం బోనులోకి వెళితే..
ABN, Publish Date - Jan 21 , 2025 | 07:27 PM
సాధారణంగా ఎవరైన పులి, సింహం వంటి క్రూర మృగాలను చూస్తే భయంతో వణుకుతారు. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్స్ కోసం వన్య ప్రాణులతో ఆటలాడుతున్నారు. ఆ క్రమంలో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా పాకిస్తాన్‌లో ఓ యువకుడికి అలాంటి పరిస్థితే ఎదురైంది.
వన్య ప్రాణులకు (Wild Animals) ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాటి జోలికి వెళ్లడమంటే కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. సాధారణంగా ఎవరైన పులి, సింహం (Lion) వంటి క్రూర మృగాలను చూస్తే భయంతో వణుకుతారు. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది వ్యూస్, లైక్స్ కోసం వన్య ప్రాణులతో ఆటలాడుతున్నారు. ఆ క్రమంలో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా పాకిస్తాన్ (Pakistan)లో ఓ యువకుడికి అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (Viral news).
పాకిస్తాన్‌లో పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన మహమ్మద్ అజీమ్ అనే వ్యక్తి లాహోర్‌లోని జంతుప్రదర్శనశాలకు వెళ్లాడు. అక్కడ బోనులో ఉన్న సింహంతో టిక్‌టాక్ వీడియో రూపొందించాలనుకున్నాడు. అక్కడ ఉన్న సిబ్బంది కళ్లు గప్పి నేరుగా సింహం బోనులోకి ప్రవేశించాడు. బోనులోకి వచ్చిన అతడిని చూసిన సింహం తన ప్రతాపం చూపించింది. అతడిపై దాడికి దిగింది. దీంతో అజీమ్ కేకలు వేశాడు. అతడి కేకలు విన్న జూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. సింహం బారి నుంచి అతడిని రక్షించారు. తీవ్ర గాయాల పాలైన అజీమ్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతన్న అజీమ్ పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ జూలో ఫొటోలు, వీడియోలు రూపొందించడంపై నిషేధం అమల్లో ఉంది. అయినా ఆ వ్యక్తి ఆ నిబంధనలను ఉల్లంఘించాడు. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోయిన సిబ్బందిపై పంజాబ్ ప్రావిన్స్ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇదెక్కడి వింత.. ఈ పంపు నీటినే కాదు.. నిప్పును కూడా వదులుతోంది.. కారణమేంటి?
Viral Video: వామ్మో.. ఈ కుక్క చాలా డేంజర్.. తన ఢీకొన్న కారుపై ఎలా పగ తీర్చుకుంటోందో చూడండి..
Penguin Love Life: పెంగ్విన్‌లలో కూడా ప్రేమ, మోసం, విడాకులు.. వెలుగులోకి ఆశ్చర్యకర నిజాలు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 21 , 2025 | 07:27 PM