Mumbai Hotel: చెప్పుల దొంగతనం.. హోటల్ యాజమాన్యం ట్రిక్ తెలిస్తే మతి పోవాల్సిందే..
ABN, Publish Date - Mar 03 , 2025 | 03:43 PM
ముంబైలోని ఓ హోటల్ మేనేజ్‌మెంట్ అద్భుతంగా ఆలోచించి తాము ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న ఓ సమస్యకు చెక్ పెట్టింది. ఆ హోటల్‌కు వెళ్లిన కస్టమర్ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అది చూసిన వాళ్లు ఆ హోటల్ మేనేజ్‌మెంట్ తెలివితేటలను ప్రశంసిస్తున్నారు.
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని అంటారు. అవతలి వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తేనే వ్యాపారంలో రాణించడం కుదురుతుంది. తాజాగా ముంబైలోని ఓ హోటల్ (Mumbai Hotel) మేనేజ్‌మెంట్ అద్భుతంగా ఆలోచించి తాము ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న ఓ సమస్యకు చెక్ పెట్టింది. ఆ హోటల్‌కు వెళ్లిన కస్టమర్ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అది చూసిన వాళ్లు ఆ హోటల్ మేనేజ్‌మెంట్ తెలివితేటలను ప్రశంసిస్తున్నారు (Viral News).
బెంగళూరుకు చెందిదన @udupendra అనే ట్విటర్ యూజర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాధారణంగా స్టార్ హోటల్స్‌కు వెళ్లినపుడు బాత్రూమ్‌కు వెళ్లేందుకు చెప్పులను కూడా ఏర్పాటు చేస్తుంటారు. షూ లేదా ఖరీదైన చెప్పులను వేసుకునే వారు బాత్రూమ్‌ను వినియోగించేటపుడు హోటల్ వారు ఇచ్చిన చెప్పులన వినియోగిస్తుంటారు. అయితే కొందరు వినియోగదారులు ఆ చెప్పులను కూడా చోరీ చేస్తున్నారట (slipper theft). హోటల్ ఖాళీ చేసినపుడు తమతో పాటు ఆ చెప్పులను కూడా తీసుకెళ్లిపోతున్నారట. దీంతో ఆ హోటల్ మేనేజ్‌మెంట్ తమ తెలివితో ఆ సమస్యకు చెక్ పెట్టింది.
హోటల్ గదిలో వేర్వేరు చెప్పులను పెట్టడం ప్రారంభించింది. సాధారణం రెండు కాళ్లకు ఒకేలాంటి చెప్పులు కాకుండా, విభిన్న రంగుల చెప్పులను పెట్టడం మొదలుపెట్టింది. దీంతో ఆ చెప్పులను దొంగతనం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఆ ట్వీట్‌పై తమ స్పందనలను తెలియజేశారు. ``హోటల్ రూమ్‌లో చోరీ చేయడం కొందరికి సరదా``, ``ఇది నిజంగా తెలివైన పరిష్కారం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీరు జీనియస్ అయితే.. ఈ ఫొటోలో కుందేలు ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..
Shocking Video: నదిలో ఆనందంగా స్నానం చేస్తున్న వ్యక్తి.. కాలికి ఏదో తగలడంతో పైకి తీసి చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 03 , 2025 | 03:43 PM