Expensive Milk: మన ఇంట్లో ఉండే వీటి పాలు లీటరు ధర అక్షరాల రూ.18 లక్షలు
ABN, Publish Date - Feb 06 , 2025 | 04:17 PM
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాలు ఏంటో తెలుసా? గాడిద పాలు అని అనుకుంటే పొరపాటే. మరి ఏ పాలు అత్యంత ఖరీదైనవో ఇప్పుడు తెలుసుకుందాం..
Most Expensive Milk : పాలు అనేక రకాలు ఉంటాయి. అవు పాలు, గేదె పాలు, మేక పాలు, గాడిద పాలు, ఒంటె పాలు అంటూ ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే, ఈ పాలు అన్నింటిలో ఖరీదైన పాలు ఏవి అంటే చాలా మంది గాడిద పాలు అని అంటారు. కానీ, గాడిద పాలుకు మించి ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాలు ఉన్నాయి. అవే ఎలుక పాలు. ఏంటి.. వీటి నుంచి కూడా పాలు తీస్తారా? అని ఆశ్చర్య పోకండి.. వినడానికి కాస్తా విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం ఎలుక పాలు ప్రపంచంలో అన్ని పాలకంటే చాల ఖరీదైనవి. లీటరు 18 లక్షల పైమాటే ఉంటుంది.
ఎలుక పాలు చాలా అరుదైనవి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ, వాటిని సేకరించడం చాలా చాలా కష్టం. ఒక లీటరు ఎలుక పాలను సేకరించడానికి దాదాపు 40000 ఎలుకలు కావాలి. అయితే, వీటిని సాధారణంగా ఆహారంగా ఉపయోగించరు.
ఎలుక పాలు ఎందుకు ఉపయోగిస్తారు?
వైద్య పరిశోధనలలో ఎలుక పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని ముఖ్యంగా కణజాల అభివృద్ధి, రోగనిరోధక వ్యవస్థపై అధ్యయనాల కోసం ప్రయోగిస్తారు. ముఖ్యంగా, మలేరియా వంటి వ్యాధులకు చికిత్స చేయడానికి, కొత్త మందులను అభివృద్ధి చేయడానికి ఎలుక పాలను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎలుకల DNA మానవుల DNAకి దగ్గరగా ఉంటుంది. పరిశోధన ఫలితాలను విశ్లేషించడానికి సులభం అవుతుంది. ఎలుక పాలు మానవ పాలకు సమానంగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. దీనివల్ల ఎలుక పాలను శిశువుల ఆహారంలో ఉపయోగించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
లీటరు ఎలుక పాల ధర రూ. 18 లక్షలు
ఎలుక పాల లీటరు ధర సుమారు రూ. 18 లక్షల వరకు ఉంటుంది. వీటిని సేకరించడం చాలా కష్టం కాబట్టి ఎక్కువ శ్రమతో కూడుకున్నది కాబట్టి వీటి ధర అంత ఎక్కువగా ఉంటుంది. ఈ పాలు సాధారణంగా మార్కెట్లో లభించవు. వీటిని వైద్య పరిశోధన సంస్థలు, ప్రయోగశాలలు మాత్రమే ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తాయి. వీటిని కొనాలంటే కూడా ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
ఎలుక పాలు వాణిజ్యపరంగా అందుబాటులో ఉండవు. ఎందుకంటే వాటి ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక లీటరు పాలను ఉత్పత్తి చేయడానికి వేలాది ఎలుకలు అవసరం అవుతాయి. అంతేకాకుండా ఇది చాలా ఖర్చుతో కూడుకుంటుంది. కాగా, ఎలుక పాలు మానవులకు ఆహారంగా ఉపయోగించడానికి సురక్షితమైనవా? కాదా? అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read: డీప్‌సీక్ ఏఐ వాడేవాళ్లకు అలర్ట్! మీ సమాచారం ఎవరి చేతుల్లోకి వెళుతోందో తెలుసా?
Updated Date - Feb 06 , 2025 | 05:59 PM