Viral News: కాపురంలో చిచ్చురేపిన బొద్దింక.. దెబ్బకు విడాకులు..
ABN, Publish Date - Jan 29 , 2025 | 03:09 PM
భార్యాభర్తల మధ్య గొడవలు, విబేధాలు సర్వసాధారణం. సాధారణంగా, ఈ వివాదాలు ముఖ్యమైన కారణాలను కలిగి ఉంటాయి, ఇది చివరికి విడాకులకు దారి తీస్తుంది. అయితే, బొద్దింక కారణంగా విడాకులు తీసుకోబోతున్న ఓ విచిత్రమైన ఘటన వైరల్ అవుతోంది..
భార్యకు బొద్దింకలంటే విపరీతమైన భయం. కిచెన్‌లో ఒకసారి బొద్దింక కనిపించడంతో మళ్లీ వంటగదిలోకి వెళ్లేందుకు నిరాకరించింది. ఆమె భయం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, దానిని చూసినప్పుడు ఆమె చాలా బిగ్గరగా అరుస్తుంది, ఆమె అరుపులకు ఇంటి పక్కనున్న ఇతర కుటుంబ సభ్యులు కూడా భయపడేవారు. ఇంట్లో బొద్దింక కనిపించినందుకు ఇల్లు మారాలని పట్టుబట్టింది. అయితే, ఆమె భయం కారణంగా అప్పటికే 18 సార్లు ఇల్లు మారారు. ఇక భార్యకు ఉన్న బొద్దింక ఫోబియాతో పూర్తిగా విసిగిపోయిన భర్త విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఈ జంట 2017లో వివాహం చేసుకుంది. కొన్ని నెలల తర్వాత వంటగదిలో బొద్దింకను చూసి కేకలు వేస్తూ బయటకు పరుగెత్తిన భార్య భయాన్ని భర్త తొలిసారి కనిపెట్టాడు. అప్పటి నుండి, ఆమె మళ్ళీ వంటగదిలోకి ప్రవేశించలేదు. ఇక చేసేదేమీలేక భర్త బలవంతంగా ఇల్లు మారాడు. అలా 18 సార్లు పదేపదే ఇళ్లు మారాల్సి రావడంతో భర్త పూర్తిగా విసిగిపోయాడు.
ఏలాంటి మార్పు లేకపోవడంతో..
తన భార్యకు ఎంత చెప్పి చూసినా తన ప్రవర్తనలో ఏలాంటి మార్పు లేదు. ఆమెను చాలా మంది వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాడు. కానీ, ఆమె మందులు తీసుకోవడానికి నిరాకరించింది. మరోవైపు తన భయంతోనే తన భర్త తనకు మతిస్థిమితం లేదని నిరూపించుకుంటున్నాడని భార్య ఆరోపిస్తోంది. భర్త ఇక విడాకులు తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకున్నాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని భయాలు ఉంటాయి, కానీ కొందరికి ఈ భయాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. బొద్దింకలకు భయపడటం సహజం. కానీ, అలాంటి భయం విడాకుల స్థాయికి చేరుకోవడం బహుశా మునుపెన్నడూ వినని విషయం.
Updated Date - Jan 29 , 2025 | 03:15 PM