ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘గవ్వల దీవి’కి వెళ్లొద్దామా..

ABN, Publish Date - Feb 09 , 2025 | 01:01 PM

ఏదైనా ఊర్లోకి అడుగుపెడితే మట్టి రోడ్లు, తారు రోడ్లు లేదంటే సిమెంటు రోడ్లు కనిపిస్తాయి. కానీ ఆ ఊర్లో మాత్రం గవ్వలు పరిచిన రోడ్లు దర్శనమిస్తాయి. కేవలం రోడ్లే కాదు... వీధులు, వాకిళ్లు, ఇంటి గోడలు, సమావేశ మందిరాలు, శ్మశానం... ఇలా ఎక్కడ చూసినా రాశులు పోసిన గవ్వలే. అన్నన్ని గవ్వలు ఆ ఊరికి ఎక్కడి నుంచి వస్తున్నాయి?

ఏదైనా ఊర్లోకి అడుగుపెడితే మట్టి రోడ్లు, తారు రోడ్లు లేదంటే సిమెంటు రోడ్లు కనిపిస్తాయి. కానీ ఆ ఊర్లో మాత్రం గవ్వలు పరిచిన రోడ్లు దర్శనమిస్తాయి. కేవలం రోడ్లే కాదు... వీధులు, వాకిళ్లు, ఇంటి గోడలు, సమావేశ మందిరాలు, శ్మశానం... ఇలా ఎక్కడ చూసినా రాశులు పోసిన గవ్వలే. అన్నన్ని గవ్వలు ఆ ఊరికి ఎక్కడి నుంచి వస్తున్నాయి?

కొన్ని ప్రాంతాల్లో ఇంటి గుమ్మాలకు గవ్వలు అలంకరించుకోవడం చూస్తుంటాం. ఇప్పుడంటే మహిళల అలంకరణలో సముద్రం ఒడ్డున దొరికే రకరకాల గవ్వల వాడకం తగ్గింది కానీ ఒకప్పుడు వీటినే ఫ్యాషన్‌గా వాడేవారు. అయితే సెనెగల్‌లో ఉన్న ఫాడియౌత్‌ గ్రామంలోకి వెళితే... గవ్వలే స్వాగతం పలుకుతాయి. రహదారుల వెంట గవ్వలు రాశులు పోసి ఉంటాయి. ఫాడియౌత్‌ ఒక చిన్న దీవి. జోల్‌ అనే ఊరు పక్కనే ఉంటుంది. జోల్‌కు ఫాడియౌత్‌కు మధ్య 800 మీటర్ల మేర కలప వంతెన ఉంటుంది. ఆ వంతెన దాటితే ఫాడియౌత్‌కు చేరుకోవచ్చు. చేపలు పట్టడం స్థానికుల ప్రధాన వృత్తి. గాలం, వలలు లేకుండానే మహిళలు కేవలం చేతులతో చేపలు పడుతుంటారు.


తరతరాలుగా...

ఈ దీవి విశేషం ఏమిటంటే... మొలస్కా జాతికి చెందిన జీవులను గ్రామస్థులు సాగు చేస్తుంటారు. ఆల్చిప్పలు, గవ్వలు, నత్తలు వంటివి మొలస్కా జాతికి చెందిన జీవులు. వీటిని ‘షెల్‌ ఫిష్‌’ అని పిలుస్తారు. ఆహారం కోసం వాటి మాంసం తీసుకుని ఖాళీ గవ్వల, ఆల్చిప్పలను బయటే పడేస్తుంటారు. కొన్ని తరాలుగా ఇక్కడి ప్రజలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. అలా వాళ్లు పడేసిన గవ్వలతో ఊరంతా గవ్వలమయంగా మారింది. రోడ్లు, ఖాళీ ప్రదేశాలు, ఇంటి గోడలు, వాకిట్లో... ఎక్కడ చూసినా గవ్వలే ఉంటాయి. చివరికి శ్మశానంలో కూడా గవ్వలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి. కొన్ని సమాధులను గవ్వలతోనే కట్టడాన్ని చూడొచ్చు. వీధులన్నీ పొరలు, పొరలుగా గవ్వలతో నిండి ఉంటాయి. ఇంటి గోడల్ని సైతం గవ్వలతో అలంకరిస్తారు. దాంతో గోడలన్నీ ఆకర్షణీయంగా కనిపిస్తాయి.


స్థానికులు మొలస్కా జాతికి చెందిన జీవులను తిని, వాటి అవశేషాలను బయట పారేయడంతో, ఏళ్ల తరబడి దృఢమైన గవ్వలు, ఆల్చిప్పలు, నత్త గుల్లలు అలా పేరుకుపోతూ వచ్చాయి. ఫలితంగా దీవిలో ఎటు చూసినా గవ్వలే కనిపిస్తుంటాయి. విశేషమేమిటంటే ఈ గవ్వలే చివరికి ఆ ఊరిని పర్యాటక ప్రదేశంగా మార్చాయి. ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఈ వింత దీవిని చూడటానికి వస్తుంటారు. వారికి దారి వెంట గవ్వలు స్వాగతం పలుకుతాయి.


గాడిదల బండ్లతో రవాణా...

ఫాడియౌత్‌ జనాభాలో క్రిస్టియన్లే ఎక్కువ. కొద్ది సంఖ్యలో ముస్లింలు కూడా ఉన్నారు. ఈ దీవిలో ఒకే ఒక శ్మశాన వాటిక ఉంది. అయితే అన్ని మతాల వారు దీన్ని ఉపయోగించు కుంటుంటారు. అందరూ తమ తమ మతాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే అందరూ సమాధులను పూడ్చడానికి, అలంకరించడానికి ఈ గవ్వల్నే వినియోగిస్తారు. మరో విశేషమేమిటంటే ఈ దీవిలో మోటార్‌బైక్‌లు, ఆటోలు, కార్లు అస్సలు కనిపించవు. రవాణా కోసం గాడిదలు లాగే బండ్లను మాత్రమే ఉపయోగిస్తుంటారు. తరాలు మారినా షెల్‌ఫిష్‌ సాగు ఇప్పటికీ అక్కడ ప్రధాన వృత్తిగా కొనసాగుతోంది. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న గవ్వల కారణంగా ఈ దీవిని ‘సీషెల్‌ ఐలాండ్‌’ అని కూడా పిలుస్తుంటారు.

Updated Date - Feb 09 , 2025 | 01:01 PM