Viral: మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లో జాబ్.. 39 ఏళ్లకే 30 కోట్లు సాధించి రిటైర్మెంట్..
ABN, Publish Date - Feb 01 , 2025 | 09:09 PM
17 ఏళ్ల వయసు నుంచే జీతంలో సగటున 50 శాతం పొదుపు చేయడం ప్రారంభించిన ఓ వ్యక్తి 39 ఏళ్లకే రూ.30 కోట్లు సంపాదించి హ్యాపీగా రిటైర్ అయిపోయారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: కొందరు లైఫంతా కష్టపడుతూ ఉన్నా రిటైర్మెంట్‌కు సరిపడా కూడబెట్టుకోలేరు. మరికొందరు ఎలాగొలా కష్టపడి కొంత కూడబెట్టుకుని హ్యాపీగా రిటైరైపోతారు. ఈ రెండు కేటగిరీలకు చెందని మూడో వ్యక్తి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మైక్రోసాఫ్ట్ లాంటి బడా సంస్థల్లో పని చేసిన ఆ వ్యక్తం 39 ఏళ్ల వయసులోనే ఏకంగా 30 కోట్లు కూడబెట్టుకుని హ్యాపీగా రిటైర్ అయిపోయారు (Viral).
Most Used Word by FM: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో అత్యధిక సార్లు వినిపించిన పదం ఇదే!
చిన్న వయసులోనే తాను భారీగా సంపాదించి రిటైర్ అయ్యే స్వేచ్ఛ ఎలా సాధించుకున్నదీ సవివరంగా తెలిపారు. జమాల్ రాబిన్స్. ఇటీవలే ఆయన 40కి చేరుకున్నారు. పేద కుటుంబంలో పుట్టిన రాబిన్స్ 17 ఏళ్ల వయసులోనే తన టార్గెట్‌ను ఎంచుకున్నాడు. 45 ఏళ్ల కల్లా రిటైర్ కావాలనేది ఆయన లక్ష్యం. ఇందుకు తగ్గట్టుగా చదువుకునే రోజుల నుంచే ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. జీతం చిన్నగా ఉన్నా 30 శాతం వరకూ పొదుపు చేసుకునేవాడు. ఆ తరువాత కాలేజీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసి ఐటీ ఫీల్డ్‌లోకి వచ్చారు.
Viral: బాత్రూమ్‌ల్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుతున్న ఉద్యోగులు.. చైనా కంపెనీ షాకింగ్ నిర్ణయం
ఆ తరువాత మేనేజ్‌మెంట్ డిగ్రీ సాధించి మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబీఎమ్ లాంటి సంస్థల్లో అంచెలంచెలుగా పైకెదిగి ఏడాదికి మిలియన్ డాలర్లు సంపాదించే స్థితికి చేరుకున్నారు. జీతంలో పొదుపును కూడా అలాగే పెంచుకుంటూ వెళ్లారు. ఒకానొక దశలో జీతంలో 90 శాతం పొదుపు చేశారు. దీంతో, ఆయన అనుకున్న దానికంటే ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్నారు. 3.5 మిలియన్ డాలర్లు కూడబెట్టగలిగారు. చివరకు రిటైర్మెంట్ ప్రకటించారు.
ఏఐలో విశేష అనుభవం ఉన్న ఆయన ఈ టెక్నాలజీ ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో రిటైర్ కావడంపై కొందరు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. కానీ ఇదే సరైన సమయమని స్పష్టం చేశారు. రిటైర్మెంట్ అంటే వ్యక్తిగత జీవితంలో ఎదిగే సమయమని, సమాజానికి ఎంతో కొంత చేసేందుకు ఈ సమయాన్ని కేటాయించాలని పేర్కొన్నారు. దీంతో, ఆయన ఉదంతంపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - Feb 02 , 2025 | 12:03 AM