ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road: 75 యేళ్లుగా చెక్కుచెదరని రహదారి

ABN, Publish Date - Jan 22 , 2025 | 01:42 PM

రోడ్డేస్తే వారంలో గుంతలమయం అయ్యే నేటి పరిస్థితులలో శివగంగ(Shivaganga) జిల్లా కారైక్కుడి వద్ద 75 యేళ్లకు ముందు తారు వాడకుండా వేసిన రహదారి చెక్కుచెదరకుండా ఉండడం చూసి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు.

- ఇది కారైక్కుడి చెట్టినాడు అద్భుతం

- కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వైనం

చెన్నై: రోడ్డేస్తే వారంలో గుంతలమయం అయ్యే నేటి పరిస్థితులలో శివగంగ(Shivaganga) జిల్లా కారైక్కుడి వద్ద 75 యేళ్లకు ముందు తారు వాడకుండా వేసిన రహదారి చెక్కుచెదరకుండా ఉండడం చూసి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. కారైక్కుడి అంటేనే చెట్టినాడు(Chettinadu) సంప్రదాయ ఇళ్ళకు పెట్టింది పేరు. కారైక్కుడి చెట్టినాడు బాణీ నివాసగృహాలు ఎప్పుడు చల్లదనంతో ఉంటాయి. విశాలమైన లోగిళ్లు, గాలి, వెలుతురు ఉండే ఈ భవనాలు శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరకుండా ఉంటాయి.

ఈ వార్తను కూడా చదవండి: State Govt: సొంతంగా విమానం కొనుగోలు చేయడం లేదు


ఆ చెట్టినాడు పద్ధతిలోనే ఇడయర్‌ తెరు నాలుగురోడ్ల కూడలి నుండి కారైక్కుడి రైల్వేస్టేషన్‌ వరకు ఉన్న 3 కిలోమీటర్ల రహదారిని స్థానిక ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. 1949లో చెట్టినాడు సంప్రదాయిక పద్ధతిలో కుంకుడు కాయలు, కరుప్పట్టి (నల్లబెల్లం), సున్నపు మిశ్రమంతో ఈ రహదారి నిర్మించారు. ఈ రోడ్డు కింద అధికారులు భూగర్భడ్రైనేజీని తవ్వేందుకు ప్రయత్నించినప్పుడు స్థానిక ప్రజలంతా ససేమిరా కుదరదన్నారు. రోడ్డుపై చిన్న గుంత తవ్వినా ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


చివరకు ఆ రహదారి జోలికి వెళ్లకుండా రహదారిపక్కనున్న భాగంలో డ్రైనేజీ తవ్వకాలు చేపట్టారు. ఆ తర్వాత ఈ రహదారి తొలగించి తారు రోడ్డు వేయాలని కార్పొరేషన్‌ అధికారులు భావించారు. ఈ ప్రతిపాదన కూడా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై కారైక్కుడి తమిళ మక్కల్‌ మండ్రం నాయకుడు ఎస్‌ఎం రాజకుమార్‌(SM Rajkumar) మాట్లాడుతూ.. 75 యేళ్లనాటి ఈ రహదారిలో రోజూ 50కి పైగా సరకుల లారీలు రైల్వేస్టేషన్‌కు వచ్చి వెళ్తుంటాయని, లోడు లారీలు ఎన్ని వెళ్ళినా ఈ రహదారి చెక్కుచెదరకుండా ఉందన్నారు.


రహదారికి ఇరువైపులా కంకర కోసం పగులగొట్టే చిన్నచిన్న రాళ్ళను పేర్చి ఉన్నారని, మరో 500 యేళ్ల దాకా ఈ రహదారి దెబ్బతినే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ రహదారిని ఇంజనీరింగ్‌ నిపుణులు, కాంట్రాక్టర్లు పరిశీలించి నాణ్యమైన రోడ్లు ఎలా వేయాలో నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు. ఈ రహదారిపై తారురోడ్డును నిర్మించకూడదని, రహదారిని వారసత్వ పర్యాటక రహదారిగా ప్రకటించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే

ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2025 | 01:42 PM