ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Wife saves husband: భర్త కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని భార్య! 40అడుగుల లోతు బావిలోకి దిగి..

ABN, Publish Date - Feb 06 , 2025 | 11:32 AM

ఓ మహిళ తన భర్తను కాపాడుకునేందుకు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించింది. వెనుకా ముందూ ఆలోచించకుండా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. 40 అడుగుల లోతైన బావిలో పడిపోయిన భర్తను కాపాడింది.

Kerala woman saves her husband's life.

భర్త (Husband) ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసి ఆమె తల్లడిల్లిపోయింది. భర్తను కాపాడుకునేందుకు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించింది. వెనుకా ముందూ ఆలోచించకుండా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. 40 అడుగుల లోతైన బావిలో పడిపోయిన భర్తను కాపాడింది. కేరళ (Kerala)లోని పిరవోమ్ పట్టణంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక, సహాయక సిబ్బంది వారిద్దరిని కాపాడి బయటకు తీశారు. ఆ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. (Wife saves husband)


పిరవోమ్ పట్టణానికి చెందిన రమేశన్(64) అనే వ్యక్తి చెట్టు నుంచి మిరియాలను తెంపుతున్నాడు. నిచ్చెన అదుపు తప్పడంతో చెట్టు పక్కనే ఉన్న 40 అడుగుల లోతైన బావిలో (Well) పడిపోయాడు. అతడు పడిన వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే అతడి భార్య పద్మ (56) విషయం గ్రహించి సహాయం కోసం పెద్దగా కేకలు వేసింది. భర్తను కాపాడుకునేందుకు ఇంకేం ఆలోచించకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి, ఒక తాడు పట్టుకుని చాకచక్యంగా బావిలోకి దిగింది. రమేశన్​ నీటిలో మునిగిపోకుండా అతడి చేతిని పట్టుకుని ఆపింది. బావిలో రమేశ్‌ను పట్టుకుని చాలా సేపు అలాగే ఉండిపోయింది.


దాదాపు 40 నిమిషాల తర్వాత సహాయక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక దళాలు బావిలోకి వలలను దించి ముందు రమేశన్‌ను బయటకు తీశారు. ఆ తర్వాత పద్మను బయటకు లాగారు. సహాయక సిబ్బంది బావిలోకి దిగడానికి ప్రయత్నించగా.. పద్మ వారిని వారించి రమేశన్‌ను ఆమె స్వయంగా ఎత్తి ఆమె వలలో కూర్చోబెట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్పంగా గాయాలైనందున వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, భర్త ప్రాణాలను కాపాడేందుకు ధైర్య సాహసాలతో వ్యవహరించిన పద్మపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Mahakumbh 2025: కుంభమేళాలో అపచారం.. ఓ జంట చేసిన పనికి నాగ సాధువుకు ఎంత కోపం వచ్చిందో చూడండి..


Couple Viral Video: అయ్యో.. నడిరోడ్డు మీద ఏంటీ పని? జంట చేష్టలు చూసి అవాక్కవుతున్న జనం..


Optical Illusion: మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్ అయితేనే.. ఈ ఫొటోలో రెండో మనిషిని 10 సెకెన్లలో కనిపెట్టగలరు..


Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..


Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 06 , 2025 | 11:32 AM