యాదగిరిగుట్ట ఆలయంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహస్వామి
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:05 PM
ముక్కోటి ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబైంది.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రధానాలయ ఉత్తర ద్వారం నుండి గరుడ వాహనం పై భక్తులకు దర్శనమిచిన లక్ష్మీ నరసింహస్వామి
ముక్కోటి ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబైంది.
వివిధ పుష్పాలతో గర్భాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు.
ప్రత్యేకంగా టైట్స్తో గ్యాలరీలు, కుర్చీలు ఏర్పాటు చేయగా. గోపుర ద్వారం అంచులు, వేదికను ఎరుపు వర్గం వస్త్రం, తిరువీది రెడ్ కార్పెట్ ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.
స్వామివారి శంఖు, చక్ర, నామాలు ధర్మకోల్ సహాయంతో వాటిపై గులాబీ, తెల్ల, పనుపు చామంతి పూలను అతికించి అందంగా తీర్చిదిద్దారు.
స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం తరలివచ్చే భక్తుల కోసం వేర్వేరుగా ప్రత్యేక గ్యాలరీలు సివిల్ అదికారులు ఏర్పాటు చేశారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుమారు 10వేల భక్తులు తరలివచ్చే అంచనాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated Date - Jan 10 , 2025 | 12:14 PM