ప్రయాగ్‌రాజ్‌లో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు!
ABN, Publish Date - Feb 18 , 2025 | 09:28 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు.
ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి గంగాదేవికి పూజలు చేశారు.
అనంతరం త్రివేణి సంగమంలో హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు.
గంగమ్మతల్లికి పూజలు చేసి, హారతులిచ్చారు. పవన్ కల్యాణ్ తో పాటు ఆయన సతీమణి అన్నా లెజ్‌నేవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు.
పుణ్యస్నానం ఆచరించిన సమయంలో ఆయన చొక్కాను తీసేసి, ధోతీపైనే నీటిలో మునిగారు.
పవన్ కల్యాణ్ జంధ్యంతో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Updated Date - Feb 19 , 2025 | 06:52 PM