ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Zodiac Sign: సంక్రాంతి నుంచి ఈ 3 రాశుల వారికి రాజయోగమే..!

ABN, Publish Date - Jan 12 , 2025 | 11:15 AM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థాన చలనం రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది. మకర సంక్రాంతి రోజున అంగారకుడు(కుజుడు), బృహస్పతి(గురుడు) స్థానచలం చెందనున్నాయి. దీని కారణంగా ఈ రోజున అర్ధకేంద్ర యోగం ఏర్పడనుంది. ఈ యోగం.. 12 రాశి చక్రాలను ప్రభావితం చేయనుంది. వ్యక్తుల జన్మ నక్షత్రం ప్రకారం.. ఆయా రాశుల వారిపైనా దీని ప్రభావం ఉంటుంది. ఈ అర్థకేంద్ర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగనుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి ఇది శుభప్రదంగా చెప్పొచ్చు. మరి ఆ అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1/7

అంగారకుడు, బృహస్పతి.. జ్యోతిషశాస్త్రంలో ఈ రెండు గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంగారకుడిని ధైర్యం, శౌర్యం, శక్తి, యుద్ధం, సైన్యం, ధైర్యసాహసాలకు ప్రతీకంగా పరిగణిస్తారు.

2/7

దేవతల గురువు బృహస్పతి అంటారు. ఓర్పు, తెలివితేటలు, వివాహం, సంతానం, సలహా, దయ, ధర్మం, జ్ఞానం, ఐశ్వర్యానికి గురువుగా పరిగనిస్తారు.

3/7

వైదిక క్యాలెండర్ ప్రకారం అంగారకుడు, బృహస్పతి గ్రహాలు మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 14వ తేదీన ఉదయం 5.32 గంటలకు అర్ధ కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తాయి.

4/7

జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం ఈ యోగం.. 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కుజుడు, బృహస్పతి అర్ధ కేంద్ర యోగం ఏర్పడటం వలన కొన్ని రాశుల వారికి ప్రయోజనం ఉంటుంది.

5/7

అర్ధకేంద్ర యోగం వలన కన్య రాశి వారికి ప్రత్యేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు అన్ని పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్టం వరించనుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.

6/7

బృహస్పతి, అంగారక గ్రహం ఏర్పరిచే అర్ధ కేంద్ర యోగం తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. తుల రాశి వారికి ఉద్యోగ ప్రయత్నంలో ప్రయాణం చేయవలసివస్తుంది. ఈ ప్రయాణం మంచి విజయాన్ని అందిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడపుతారు.

7/7

అర్ధ కేంద్ర యోగం కుంభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కెరీర్‌లో మంచి అవకాశాలు ఉంటాయి. వ్యాపారం చేసే వ్యక్తులు మంచి లాభాలు పొందుతారు.

Updated Date - Jan 12 , 2025 | 01:35 PM