Surya Namaskaralu: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో సూర్య నమస్కారాలు
ABN, Publish Date - Feb 04 , 2025 | 10:20 AM
సకల ప్రాణకోటికి సూర్యూడే జీవనాధారం. యోగాసనాల్లో ప్రధానంగా సూర్య నమస్కారాలు చేయుటంతో చాలా సత్ఫలితాలు పొందొచ్చు. సూర్యనమస్కారం ఉదయం , సాయంకాలల్లో చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని పలువురు చెబుతున్నారు. యోగాసనాలు, ప్రాణాయామం కలిపి చేసేదే సూర్యనమస్కారం అంటారు. ఈ అసనాలు చేయడం వల్ల శరీరం ఉత్తేజం అవుతుంది.
విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో రథసప్తమి సందర్భంగా పలువురు స్థానికులు మంగళవారం సూర్య నమస్కారాలు చేశారు.
సూర్య నమస్కారాలు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయని వారు తెలిపారు.
యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్ర ధ్యానం చేస్తే ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయని అన్నారు.
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలని సూచించారు.
సూర్య నమస్కారాలు నిటారుగా ప్రార్థనా భంగిమలో నిల్చోని చేయాలి.
రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి.
కొద్ది నిమిషాల పాటు ఉచ్చ్వాస నిచ్చ్వాసల ప్రకారం సూర్య నమస్కారాలు చేయాలి.సూర్య నమస్కారాలు మీ శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచడంలో సహాయపడతాయని విశాఖపట్నం వాసులు పేర్కొన్నారు.
Updated Date - Feb 04 , 2025 | 10:24 AM