Twins Day: కవలల పండుగ.. ఇన్ని వేలమంది ఉన్నారా..
ABN, Publish Date - Feb 22 , 2025 | 06:29 PM
ఒకే పోలికతో ఉన్న కవలలు కనిపిస్తే ఒకింత వింతగా చూస్తాం. వారి అభిరుచులు, డ్రెస్సింగ్, ప్రవర్తన అన్నీ కూడా ప్రత్యేకమే.
ప్రతి ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన ప్రపంచ కవలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.
కవలల దినోత్సవాన్ని జరుపుకోడానికి ఓ ప్రత్యేక సందర్భం ఉంది.
ప్రపంచంలో తొలిసారిగా కవలల దినోత్సవాన్ని పోలెండ్ దేశంలో 1976లో నిర్వహించారు.
పోలెండ్‌లో మోజన్, ఆరన్ విల్‌కాక్స్ అనే కవలలు తాము నివసిస్తున్న గ్రామానికి ట్విన్‌బర్గ్ అని పేరు పెట్టుకున్నారు.
వారిద్దరి అనుబంధాన్ని విడవకూడదనే ఉద్దేశంతో ఒకే ఇంట్లోని అక్కాచెళ్లను పెళ్లి చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యాధితో వారు ఒకే రోజు (ఫిబ్రవరి 22)న మరణించారు. వారి గౌర వార్థంగా నాటి నుంచి ట్విన్స్‌డేని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుపతిలోని సీపీఎం కార్యాలయంలో ప్రపంచ కవలల దినోత్సవం శనివారం నాడు ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పలువురు ట్విన్స్ పాల్గొని సందడి చేశారు.
తిరుపతిలో ఓ ప్రైవేటు సంస్థ ప్రతి ఏడాది కవలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది. ట్విన్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఇచ్చిన వివరాల మేరకు కేవలం తిరుపతి జిల్లాలో సుమారు 12 వేల పైచిలుకు కవలలు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే.
కవల పిల్లల్లో ఒకే పోలికలతో కనిపించే వారిని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. కవల పిల్లలను త్వరగా గుర్తించడం చాలా కష్టం.
కవలల అలవాట్లు, ఇష్టాలు, కోపం, సంతోషం ఒకేలా ఉంటాయని పలు సినిమాల్లో చూపిస్తుంటారు.
కవలలను త్వరగా గుర్తు పట్టాలంటే ఎంతో కష్టం. వారిలో మనం ఎవరి కోసం వెతుకుతామో వారిని గుర్తించాలంటే పెద్ద పరీక్షే.
కవలలను చూడటం చాలా అరుదు అనుకుంటాం. అయితే తిరుపతిలో నిర్వహించిన ట్విన్స్ డేకు అపూర్వమైన స్పందన వచ్చింది
కవలలను గుర్తు పట్టడం చాలా కష్టం. ఒకే రోజు నిమిషాల తేడాలో పుట్టి, పెరుగుతున్న వారిని గుర్తించడం వారి తల్లిదండ్రులకూ ఇబ్బందిగానే ఉంటుంది.
అలాంటిది ఒకే పాఠశాలలో వివిధ తరగతుల్లో చదువుతున్న కవల విద్యార్థులను గుర్తించడం బోధించే ఉపాధ్యాయులకు సైతం సమస్యగానే ఉంటుంది.
Updated Date - Feb 22 , 2025 | 10:09 PM