Vivek Ramaswamy DOGE: మిమ్మల్ని మస్క్ తొలగించారా అన్న ప్రశ్నకు వివేక్ రామస్వామి సమాధానం ఏంటంటే..
ABN, Publish Date - Jan 28 , 2025 | 03:18 PM
డోజ్ శాఖ నుంచి తాను వైదొలగడానికి ఎలాన్ మస్క్ కారణం కాదని రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికన్ నేత వివేక్ రామస్వామి అన్నారు. తమ పంథాలు పరస్పరం సహాయకారకంగా ఉన్నాయని వ్యా్ఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్ సారథ్యంలోని డోజ్ శాఖ నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి తాజాగా ఈ అంశంపై పలు కీలక వ్యా్ఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌తో (Elon Musk) తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. డోజ్ శాఖకు సంబంధించి తాము అనుసరించదలిచిన పంథాలు భిన్నమైనమేనవే అయినా పరస్పర సహాయంగా ఉన్నాయని అన్నారు. తామిద్దరిదీ ఒకే ఉద్దేశమని పేర్కొన్నారు (NRI).
అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గించి వివిధ శాఖల్లో ఉత్పాదకత పెంచేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డోజ్ శాఖను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ శాఖ బాధ్యతలను మొదట్లో ఆయన ఎలాన్ మస్క్‌తో పాటు వివేక్ రామస్వామికి అప్పగించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో డోజ్ నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నారు. దీని వెనక ఎలాన్ మస్క్ హస్తం ఉన్నట్టు వార్తలు వచ్చాయి (Vivek Ramaswamy DOGE Exit).
Canada Study Permit: విదేశీ విద్యార్థులకు షాక్..కెనడా స్టడీ పర్మిట్లల్లో మళ్లీ కోత!
అయతే, మస్క్‌తో విభేదాల గురించి ఫాక్స్ న్యూస్ వ్యా్ఖ్యాత తాజాగా రామస్వామిని ప్రశ్నించారు. దీనికి రామస్వామి స్పందిస్తూ అవన్నీ అవాస్తవాలని కొట్టి పారేశారు. ‘‘నా ఉద్దేశంలో ఇది కరెక్ట్ కాదు. మా ఇద్దరి మార్గాలు భిన్నవైనమే అయినా పరస్పర అనుకూలమైనవి. నేను రాజ్యాంగం, చట్ట విధానాలపై దృష్టి పెట్టా. వారు టెక్నాలజీ, భవిష్యత్తులో రాబోయే మార్పులుపై దృష్టిసారించారు. మనం రాజ్యాంగ స్థాయి పునరుజ్జీవనం గురించి మాట్లాడుతున్నప్పుడు అది కేవలం కేంద్ర ప్రభుత్వంతోనే కాకుండా సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలు కూడా పాలుపంచుకోవాలి. ఇక సాంకేతిక, డిజిటల్ విధానంలో దిశానిర్దేశం చేసే వ్యక్తి మస్క్‌కు మించిన వారు లేరు’’ అని వివరించారు.
మస్క్ మిమ్మల్ని తొలగించారా అన్న ప్రశ్నకు ఆయన లేదని స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ‘‘లేదు.. మేము పరస్పరం చర్చించుకున్నాం. మా ఇద్దరి అభిప్రాయం ఒకటే. దేశాన్ని కాపాడాలంటే ఒక్కరివల్ల కాదు. అందరి భాగస్వామ్యం అవసరం. నేను కోరుకునేది ఇదే’’ అని చెప్పుకొచ్చారు.
Visa Woes: మొదలైన ట్రంప్ దబిడిదిబిడి! పిల్లల్ని చూసేందుకు అమెరికాకు వెళ్లితే ఎయిపోర్టులోనే..
ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం, నిబంధనలు సరళీకరించడంపై సలహాలు, సూచనలు ఇచ్చే శాఖగా ట్రంప్ డోజ్‌ను ప్రతిపాదించారు. ప్రభుత్వ పరిధిలోకి రాని ఈ శాఖ మార్గనిర్దేశకత్వం కోసం ఏర్పాటు చేశారు. రాజ్యాంగం, చట్టాలకు అనుగూణంగా ఏయే శాఖలకు కత్తెర వేయాలి, నిబంధనలను ఎలా సరళీకరించాలి అనే అంశాలపై వివేక్ రామస్వామి దృష్టిపెట్టగా, మస్క్ మాత్రం టెక్నాలజీ, డాటా మైనింగ్ సాయంతో డోజ్ శాఖ లక్ష్యాలను చేరుకోవాలని ఆశించినట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
Updated Date - Jan 28 , 2025 | 03:21 PM