Canada Study Permit: విదేశీ విద్యార్థులకు షాక్..కెనడా స్టడీ పర్మిట్లల్లో మళ్లీ కోత!
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:27 PM
దేశంలో వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు కెనడా మరోసారి స్టూడెంట్ పర్మిట్లలో కోత పెట్టింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మరో శాతం తక్కువగా స్టడీ పర్మిట్లు జారీ చేస్తామని పేర్కొంది.

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ విద్యార్థులకు కెనడా మరో షాకిచ్చింది. ఈ ఏడాది కూడా ఫారిన్ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ వీసాల్లో కోత విధించింది. దేశంలో నివాస సముదాయాల కొరత, వైద్య రంగం, ఇతర సర్వీసులపై ఒత్తిడిని తగ్గించేందుకు కెనడా ఈ చర్యలు తీసుకోంది (Study Permit Canada).
ఇమిగ్రేషన్ శాఖ ప్రకటన ప్రచారం, ఈ ఏడాది 437,000 స్టడీ పర్మిట్లు మాత్రమే జారీ చేయనుంది. గతేడాదితో పోలిస్తే ఇది 10 శాతం తక్కువ. 2024లో తొలిసారిగా అక్కడి ప్రభుత్వం స్టూడెంట్ పర్మిట్‌లో కోతలను ప్రకటించింది. నివాస సముదాయాల కొరత నానాటికీ అధిగమవుతున్న తరుణంలో ట్రూడో ప్రభుత్వం విదేశీ విద్యార్థుల రాకకు అడ్డుకట్ట వేసింది.
Visa Woes: మొదలైన ట్రంప్ దబిడిదిబిడి! పిల్లల్ని చూసేందుకు అమెరికాకు వెళ్లితే ఎయిపోర్టులోనే..
2023లో కెనడా రికార్డు స్థాయిలో 650,000 స్టడీ పర్మిట్లను జారీ చేసింది. దీంతో, దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్య మిలియన్ మార్కు దాటింది. గత దశాబ్దంలో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ. దేశంలోకి వలసలు ఎక్కువవడంతో జనాభా బాగా పెరిగి వనరులపై ఒత్తిడి పడింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో కొరత పెరిగింది. అంతేకాకుండా, ఇళ్ల అద్దెలు కూడా విపరీతంగా పెరిగాయి. అయితే, విదేశీ విద్యార్థుల కెనడా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారారు. దేశీయ విద్యార్థుల కంటే అధిక ఫీజులు చెల్లించే ఫారిన్ స్టూడెంట్లకు అక్కడి విశ్వవిద్యాలయాలు ఘన స్వాగతం పలికేవి.
Blood Donation Camp: అమెరికాలో శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఇక గతేడాది విధించి ఆంక్షల్లో భాగంగా విదేశీ విద్యార్థులు ప్రొవిన్షియల్ అటెస్టేషన్ లేటర్ దాఖలు చేయాల్సి వచ్చేది. ఈ నిబంధనను ప్రస్తుతం మాస్టర్స్, పోస్ట్ డాక్టోరల్ విద్యార్థులకు కూడా వర్తింప జేశారు. వీసా పరిమితికి లోబడి విద్యార్థుల సంఖ్య ఉన్నదో లేదో తేల్చుకునేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం ఈ అటెస్టేషన్ లెటర్ల విధానాన్ని ప్రవేశపెట్టింది.
NRI: రిపబ్లిక్ డే వేడుకలు.. నెలానెలా తెలుగు వెలుగు కార్యక్రమం.. ఈసారి సందడే సందడి..