ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలతో భూమి భారతికి స్వర నీరాజనం

ABN, Publish Date - Jan 26 , 2025 | 01:37 PM

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహించే 76వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా – ఘనమైన నా భారతదేశపు గణతంత్రదినోత్సవం (76వ) ‘దేశభక్తి గీతాలతో భూమి భారతికి స్వర నీరాజనం పేరిట ఈనెల నిర్వహించారు.

TANA PSV

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహించే 76వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనమైన నా భారతదేశపు గణతంత్రదినోత్సవం (76వ) ‘దేశభక్తి గీతాలతో భూమి భారతికి స్వర నీరాజనం పేరిట ఈనెల నిర్వహించారు. తానాఅధ్యక్షులు నిరంజన్ శృంగవరపు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకు ఆత్మీయ స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “భారతదేశపు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజునే తానా 76వ సాహిత్య కార్యక్రమం జరుపుకోవడం యాదృచ్చికమైనా సంతోషకరమన్నారు. భరతభూమిసేవలో 4 దశాబ్దాలకు పైగా వివిధ ఉన్నతహోదాలలో విశిష్ట సేవలందించిన ఇద్దరు తెలుగువారు లెఫ్ట్నెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు, మేజర్ జనరల్ నందిరాజు శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.


గణతంత్ర దినోత్సవం సందర్భంగా తానా నిర్వహించిన కార్యక్రమంలో చాలా ఉత్తేజకరంగా ఉందని అతిధులు లెఫ్ట్నెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు, మేజర్ జనరల్ నందిరాజు శ్రీనివాసరావు తెలిపారు. సామాజికసేవలో వందేళ్ళ ఆకాశవాణి పాత్రను ప్రముఖ గీత రచయిత, సంగీతదర్శకులు, ఆకాశవాణి విశ్రాంత కళాకారులు కలగా కృష్ణమోహన్ వివరించారు. ఆకాశవాణి ద్వారా ఎన్నో దశాబ్దాల క్రితం ప్రసారమైన దేశభక్తి గీతాలను ఈ కార్యక్రమంలో ప్రసారం చేశారు. ప్రముఖ గాయకులు ఎం.ఆర్.కె ప్రభాకర్, శీలం రమణ, మాధురి రావూరిలు దేశభక్తి గీతాలను ఆలపించారు.


తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ ప్రసాద్ తోటకూర నిర్వహణలో కార్యక్రమం అద్భుతంగా సాగిందని ప్రశసించారు. ఎంతో సమయాన్ని వెచ్చించి కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వందనసమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 26 , 2025 | 01:53 PM