ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

H-1b Visa: ట్రంప్ నిర్ణయాలతో భారతీయుల్లో పతాకస్థాయికి టెన్షన్!

ABN, Publish Date - Jan 21 , 2025 | 10:22 PM

పుట్టుకతో వచ్చే పౌరసత్వానికి ముగింపు పలుకుతూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు అమెరికాలోని భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. తమ పిల్లలు మేజర్లయ్యాక అమెరికా వీడాల్సి వస్తుందని అనేక మంది ఆందోళన చెందుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపడంతో అగ్రరాజ్యంలో కొన్నేళ్లుగా ఉంటున్న భారతీయుల్లో టెన్షన్ పతాకస్థాయకి చేరుకుంది. తన పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కకపోతే ఇండియాకు తిరిగి రావాల్సి వస్తుందన్న ఆందోళన అనేక మందిలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితికి అనుగూణంగా ఇప్పటికే కొందరు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

NRI: టాంటెక్స్ సాహిత్య వేదికగా ‘సాహిత్య అద్భుత వర్ణనలు - వర్ణించ తరమా’

అమెరికాలో పుట్టుకతో పౌరసత్వానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ఇటీవల ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఆదేశాల్లో అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం విదేశీయుల సంతానం అమెరికాలో జన్మించినా వారికి పౌరసత్వం లభించదు. గ్రీన్ కార్డు, లేదా పౌరసత్వం ఉన్న విదేశీయుల సంతానానికి మాత్రమే ఈ ఆటోమేటిక్ పౌరసత్వం వర్తించేలా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో, హెచ్-1బీ వంటి తాత్కాలిక వీసాలపై అమెరికాలో కొన్నేళ్లుగా ఉంటున్న భారతీయులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు.


Revanth Reddy: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో తెలంగాణ సీఎంతో ‘మీట్ అండ్ గ్రీట్

కొన్నేళ్ళ క్రితమే హెచ్-1బీపై అమెరికాకు వెళ్లిన అనేక మంది బారతీయులు అక్కడే స్థిరపడి పిల్లల్ని కన్నారు. కొందరు తమ పిల్లలు చిన్నతనంలో ఉండగానే అమెరికాకు వెళ్లారు. ఇప్పటి వరకూ ఈ చిన్నారులు తల్లిదండ్రులపై ఆధారపడ్డ వారిగా హెచ్-4 వీసాతో అమెరికాలో ఉంటున్నారు. వీరిలో అనేక మంది రాబోయే రోజుల్లో మేజర్లు కానున్నారు. అమెరికాలో వీరిని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌గా పిలుస్తారు. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ మేజర్లయితే హెచ్-4 వీసా కోల్పోవాల్సి వస్తోంది. ఆ లోపు అమెరికా పౌరతస్వం, గ్రీన్ కార్డు, లేదా మరే తాత్కాలిక వీసా మంజూకాక పోతే అమెరికాను వీడి స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది.


డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సమస్యల పరిష్కారానికి బైడెన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అమెరికాస్ చిల్డ్రన్ బిల్లుకు చట్టం రూపం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ బిల్లు ప్రకారం, అమెరికాలో పదేళ్లుగా ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించిన డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు గ్రీన్ కార్డు లభిస్తుంది. అయితే, ఈ బిల్లు కార్యరూపం దాల్చ లేదు. ఈ లోపే ట్రంప్ అమెరికా పగ్గాలు చేపట్టడంతో విదేశీయులు, వారి పిల్లల్లో టెన్షన్ పతాకస్థాయికి చేరుకుంది.

TPAD: యూఎస్ఏలో వైభవంగా తెలంగాణ పీపుల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డాలస్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

Read Latest and NRI News

Updated Date - Jan 21 , 2025 | 10:24 PM