Women’s day: లక్ష్యం వైపు వడివడిగా!
ABN, Publish Date - Mar 08 , 2025 | 06:14 AM
మహిళలు, పురుషుల మధ్య వివిధ అంశాల్లో సమానత్వం ఏ దేశంలో ఏ మేరకు ఉందో వెల్లడిస్తూఏటా ‘ప్రపంచ లింగ సమానత్వ సూచీ’ని ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (డబ్ల్యూఈఫ్) విడుదల చేస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే వేడుకలు నిర్వహించుకొనే రోజు మాత్రమే కాదు... సమాజంలో మార్పు, మహిళల పురోగతి, లింగ సమానత్వం గురించి సరికొత్త రూపాల్లో చర్చలకు, చర్యలకు దోహదం చేసే రోజు కూడా. మహిళలు, పురుషుల మధ్య వివిధ అంశాల్లో సమానత్వం ఏ దేశంలో ఏ మేరకు ఉందో వెల్లడిస్తూఏటా ‘ప్రపంచ లింగ సమానత్వ సూచీ’ని ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (డబ్ల్యూఈఫ్) విడుదల చేస్తుంది. సామాజికమైన పురోగతిని, దేశాభివృద్ధిని నిర్ధారించే విషయాల్లో లింగ సమానత్వం అత్యంత కీలకం. కానీ ఈ దిశగా ఇప్పటికే సాగుతున్న ప్రయత్నాలు ప్రస్తుత వేగంతో కొనసాగితే మన ప్రపంచం ఆ లక్ష్యాన్ని సాధించడం 2158 వరకూ... అంటే మరో 133 ఏళ్ల వరకూ సాధ్యం కాదని ‘డబ్ల్యూఈఫ్’ తాజా సూచీ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో... లింగ సమానత్వం దిశగా కృషిని వేగవంతం చెయ్యాల్సిన ఆవశ్యకతను చాటి చెబుతూ... ‘యాక్సిలరేట్ యాక్షన్’ (త్వరితగత చర్య) అనే థీమ్‌తో ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం.
విద్య, ఉద్యోగ అవకాశాల్లో, వేతనాల్లో మహిళలు ఎదుర్కొటున్న అసమానతలు తగ్గించడం, మహిళా నాయకత్వం పెంచడం, సమాన అవకాశాలు కల్పించడం, లైంగిక వేధింపులను, అత్యాచారాలను నివారించడం, పని చేసే చోట, బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతకు భరోసా ఇవ్వడం... ఇవన్నీ ఒక దేశ అభివృద్ధికి సూచికలు అవుతాయి. సమాన అవకాశాలు ఉండే సమ్మిళిత సమాజమే ఆదర్శ సమాజం అవుతుంది. ఈ నేపథ్యంలో... ‘యాక్సిలరేట్ యాక్షన్’ థీమ్ కింద వివిధ రంగాల్లో కార్యాచరణను వేగవంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా మహిళా సంస్థలు ప్రణాళిక
రూపొందించాయి. వాటిలో ప్రధానాంశాలు:
మహిళలు, పురుషులు ఒకే పని చేసినా... చాలా దేశాల్లో ఇప్పటికీ మహిళలకు దక్కే ప్రతిఫలం తక్కువగా ఉంటోంది. ఈ అంతరాన్ని తగ్గించడం అత్యవసరం. కాబట్టి సమాన వేతనం, పనిచేసే చోట సమాన హక్కులు అనే విధానాలను ప్రోత్సహించాలి.
కోట్లాది బాలికలు చదువుకు, ఆరోగ్య సంరక్షణకు దూరంగా ఉన్నారు. మహిళల శ్రేయస్సుకు, సాధికారతకు విధానపరమైన మద్దతు ఇచ్చి, వనరులు సమకూర్చాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉంది.
పలు రంగాల్లో, ప్రధానంగా రాజకీయ, కార్పొరేట్ రంగాల్లోని నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ‘అధికారాలకు పురుషులే అర్హులు’ అనే భావనలను తొలగించాలి. ఎక్కుమంది మహిళలకు నాయకత్వ స్థానాలు లభించే మార్గాలను సృష్టించాలి.
అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నా... మహిళలపై హింస తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. దీన్ని అరికట్టడానికి చట్టాలను మరింత కఠినతరం చేయాలి.
వీటితోపాటు మరిన్ని కీలకమైన లక్ష్యాలు సాధించడం కోసం వ్యక్తిగత, సామాజిక, సంస్థాగత స్థాయిలో కృషి చేయాలి. మహిళల పురోగతిపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యూహాలు రూపొందించడం, వనరులు సమీకరించడం, కార్యకలాపాలను విస్తరించడం ద్వారా లింగ సమాన త్వాన్ని సాధించా లనేది ఈ థీమ్ లక్ష్యం.
ఇవి కూడా చదవండి...
Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..
Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ
Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..
Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 08 , 2025 | 06:14 AM