AAP: కేజ్రీవాల్‌కు ఆప్‌ద!
ABN, Publish Date - Feb 09 , 2025 | 05:02 AM
ఒకవేళ బీజేపీ ‘ఆపరేషన్ కమల్’ను ప్రారంభిస్తే.. తుడిచిపెట్టుకుపోతుందా? ఇప్పుడు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇది..!
క్యాడర్‌ను బీజేపీ లాగేసే ప్రమాదం
ఢిల్లీలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భవిష్యత్ ఏమిటి? గోవా నుంచి ఢిల్లీ వరకు తమ పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటుందా? ఒకవేళ బీజేపీ ‘ఆపరేషన్ కమల్’ను ప్రారంభిస్తే.. తుడిచిపెట్టుకుపోతుందా? ఇప్పుడు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇది..! ప్రస్తుతం 92 మంది ఎమ్మెల్యేలతో ఆప్ పంజాబ్‌లో అధికారంలో ఉంది. ఢిల్లీ తాజా ఎన్నికల్లో 22 స్థానాలను నిలబెట్టుకుంది. వీటితోపాటు.. గుజరాత్‌లో ఐదుగురు, గోవాలో ఇద్దరు, జమ్మూకశ్మీర్‌లో ఒకరు చొప్పున ఆప్ ఎమ్మెల్యేలున్నారు. లోక్‌సభలో ఆప్ బలం మూడు మాత్రమే..! మోదీ-షా ద్వయం ఒకవేళ ‘ఆపరేషన్ కమల్’ను ప్రకటిస్తే.. వీరిలో ఎంతమంది ఆప్‌ను వీడుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..! ఢిల్లీ ఎన్నికలకు ముందే.. ఎనిమిది మంది ఆప్ సిటింగ్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌పై విమర్శలు చేస్తూ.. బీజేపీ పంచన చేరారు.
శుక్రవారం పార్టీ అభ్యర్థులతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు నాకు సమాచారం ఉంది. ఒక్కొక్కరికీ రూ.15 కోట్లు ఇచ్చి, బీజేపీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. అదే జరిగితే.. ఢిల్లీలో ఆప్ పరిస్థితి ఏమిటనేదానికి ప్రస్తుతానికి సమాధానాల్లేవని విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ఇప్పుడు బీజేపీ-కాంగ్రెస్ మాత్రమే తలపడుతున్నాయి. క్రమంగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేలా బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఇప్పటికే ఒడిసాలో బీజేడీ, మహారాష్ట్రలో ఎన్సీపీ-శివసేన కూటమి, అసోంలో ఏజీపీ వంటి పార్టీలకు చెక్‌పెట్టి.. కాంగ్రెస్ కంచుకోటలైన పలు రాష్ట్రాల్లో పాగా వేసింది. ఈ క్రమంలో గోవా, గుజరాత్, జమ్మూకశ్మీర్, ఢిల్లీల్లో ఆప్‌ను అడ్డు తొలగించే దిశలో మోదీ-షా ద్వయం వ్యూహరచన చేస్తే.. కేజ్రీవాల్ తిరిగి కోలుకోవడం కష్టమనే అభిప్రాయాలున్నాయి.
- సెంట్రల్ డెస్క్
ఇవి కూడా చదవండి
Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
For More National News and Telugu News..
Updated Date - Feb 09 , 2025 | 05:02 AM