Anna varsity: విద్యార్థిని అత్యాచారం కేసు.. పక్షవాతం అంటూ నిందితుడి నాటకం
ABN, Publish Date - Jan 24 , 2025 | 01:23 PM
అన్నావర్సిటీ విద్యార్థినిపై అత్యాచారం కేసు ప్రధాన నిందితుడు జ్ఞానశేఖరన్‌తో అడయార్‌కు చెందిన ఆరుగురు పోలీసులకు సంబంధాలున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెల్లడైంది. రెండు రోజుల క్రితం జైలులో ఉన్న జ్ఞానశేఖరన్ పక్షవాతం వచ్చినట్లు నేలపై పడి దొర్లగా, చూసిన పోలీసులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు.
- ఆరుగురు పోలీసులతో సంబంధం
చెన్నై: అన్నావర్సిటీ(Annavarsity) విద్యార్థినిపై అత్యాచారం కేసు ప్రధాన నిందితుడు జ్ఞానశేఖరన్(Gnana shekaran)తో అడయార్‌కు చెందిన ఆరుగురు పోలీసులకు సంబంధాలున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెల్లడైంది. రెండు రోజుల క్రితం జైలులో ఉన్న జ్ఞానశేఖరన్ పక్షవాతం వచ్చినట్లు నేలపై పడి దొర్లగా, చూసిన పోలీసులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని, మూర్చవ్యాధి, పక్షవాతం లేదని ప్రకటించారు.
ఈ వార్తను కూడా చదవండి: Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
దీంతో జ్ఞానశేఖరన్ జైలు నుండి పారిపోయేందుకు పథకంవేసి మూర్చవచ్చినట్లు నటించాడని పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందంలోని మహిళా ఐపీఎస్ అధికారులు జ్ఞానశేఖరన్‌ను రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జ్ఞానశేఖర్‌కు అడయార్ ప్రాంతానికి చెందిన ఆరుగురు పోలీసులతో సన్నిహిత సంబంధాలున్నాయని, వారి సహాయంతోనే అతడు నేరాలకు పాల్పడ్డాడని గుర్తించారు. ఆ ఆరుగురు పోలీసులను గుర్తించి వారి సెల్‌ఫోన్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జ్ఞానశేఖరన్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్(Cellphone) నుండి ఆ ఆరుగురు పోలీసులకు మొబైల్‌ఫోన్లకు ఎన్నో కాల్స్ వెళ్ళాయని, విద్యార్థినిపై అత్యాచారం జరిగిన తర్వాత కూడా అతడు కొరట్టూరులోని తన బిర్యాని దుకాణం నుంచి వారితో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుసుకున్నారు.. ఆరుగురు పోలీసులు జ్ఞానశేఖరన్ నడిపే బిర్యానీ దుకాణానికి వెళ్ళి ఉచితంగా బిర్యానీ పార్శిల్స్ తీసుకెళ్లేవారిని కూడా దర్యాప్తులో వెల్లడైంది. త్వరలో ఆరుగురు పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?
ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?
ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!
Read Latest Telangana News and National News
Updated Date - Jan 24 , 2025 | 01:23 PM