Speaker: పంచనామాకు అనుమతులు ఇవ్వలేదు..
ABN, Publish Date - Jan 01 , 2025 | 11:59 AM
విధానపరిషత్‌లో మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్, ఎమ్మెల్సీ సీటీ రవి(Minister Lakshmi Hebbalkar, MLC CT Ravi) మధ్య చోటు చేసుకున్న వివాదంపై పంచనామాకు అనుమతులు ఇవ్వలేదని సభాపతి బసవరాజ హొరట్టి(Speaker Basavaraja Horatti) తెలిపారు.
బెంగళూరు: విధానపరిషత్‌లో మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్, ఎమ్మెల్సీ సీటీ రవి(Minister Lakshmi Hebbalkar, MLC CT Ravi) మధ్య చోటు చేసుకున్న వివాదంపై పంచనామాకు అనుమతులు ఇవ్వలేదని సభాపతి బసవరాజ హొరట్టి(Speaker Basavaraja Horatti) తెలిపారు. హుబ్బళ్ళిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివాదం చేయిదాటిందన్నారు. వివాదానికి సంబంధించి పంచనామాకు డీజీపీ అనుమతి కోరారన్నారు. పంచనామా ఏ విధంగా జరుపుతారనేది స్పష్టత లేనందున అనుమతులు ఇవ్వలేదన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: వామ్మో.. కిలో మల్లెపూలు రూ.4,200...
వివాదం జరిగినప్పుడు అక్కడ ఉండే వారందరినీ పిలిపించి పంచనామా చేస్తారా..? లేదా ఖాళీగా అమలు చేస్తారా అనేది తెలియదన్నారు. డీజీపీ, పరిషత్ కార్యదర్శికి లేఖ పంపారన్నారు. మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తనకు లేఖ రాయడం మినహా వీడియో, ఆడియో వంటి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. ఎవరైనా ఆధారాలు ఇస్తే ఎఫ్‌ఎ్‌సఎల్‌కు పంపుతామన్నారు. సోమవారం పరిషత్ కార్యదర్శి మహాలక్ష్మికి లేఖ పంపారు.
డీజీపీకి ఫిర్యాదు..
బెళగావి పరిషత్‌లో డిసెంబరు 19న చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీలు సీటీ రవి, రవికుమార్ తదితరులు మంగళవారం డీజీపీని కలిశారు. బెళగావి(Belagavi)లోని సువర్ణసౌధ లోపలకు వచ్చిన మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అనుచరులు దాడి చేశారని డీజీపీ అలోక్‌మోహన్‌కు ఫిర్యాదు చేశారు. బెళగావి నగర పోలీస్ కమిషర్, ఎస్పీలపైనా ఆరోపణలు చేశారు. డీసీఎం డీకే శివకుమార్, ప్రోత్సాహంతోనే దాడి జరిగిందన్నారు. తనను పశువు తరహాలో కిడ్నాప్ చేశారని, రాత్రంతా ఆరేడు పోలీస్ స్టేషన్లు తిప్పారని తెలిపారు. అందరిపైనా కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.
ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు
ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905
ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు
Read Latest Telangana News and National News
Updated Date - Jan 01 , 2025 | 11:59 AM