ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ranveer Allahbadias controversy: రణ్‌వీర్‌ అల్హాబాదియా అసభ్యకర కామెంట్స్‌‌పై పార్లమెంటులో చర్చ!

ABN, Publish Date - Feb 11 , 2025 | 11:42 PM

యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాహ్‌బాదియా కాంట్రవర్షియల్ వ్యాఖ్యలను శివ సేన ఎంపీ పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు. ఓటీటీ వేదికలను సెన్సార్ షిప్ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాహ్‌బాదియా కాంట్రవర్షియల్ వ్యాఖ్యలను శివ సేన ఎంపీ నరేశ్ పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో కంటెంట్‌పై నియంత్రణకు కఠిన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

‘‘సోషల్ మీడియాలో కంటెంట్ నియంత్రణ కోసం ఓ ప్రత్యేక చట్టం తేవాల్సిన అసవరం ఉందని నా అభిప్రాయం. బారతీయ సంస్కృతిని కించపరిచే సోషల్ మీడియా కంటెంట్, పాడ్‌కాస్ట్స్, ఓటీటీ కంటెంట్‌ను నియంత్రించాలి’’ అని ఎంపీ నరేశ్ అన్నారు.

Bihar Poll Prediction: బీహార్ ఎన్నికల్లోనూ సర్‌ప్రైజ్ తప్పదు: ప్రశాంత్ కిశోర్


‘‘నిన్న ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తల్లిదండ్రులపై అసభ్యకర కామెంట్స్ చేశారు. ఇలాంటి కంటెంట్ ఓటీటీ వేదికల్లో సులువుగా వ్యాప్తి చెందుతోంది. వీటిపై ఎలాంటి చట్టబద్ధమైన నియంత్రణ ఉండట్లేదు. చివరకు మన దేవుళ్లు, దేవతలను కూడా కించపరిచే స్థాయికి దిగజారుతున్నారు. సెన్సార్ షిప్ లేకపోవడమే ఇందుకు కారణం’’ అని అన్నారు.

గురువారం పార్లమెంటులో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు!


‘‘వీళ్ల కంటెంట్‌పై ఎలాంటి ఆంక్షలు ఉండట్లేదు. రాజకీయ నాయకుల గురించి కూడా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిపెట్టాలి, సెన్సార్ షిప్‌ తీసుకురావాలి’’ అని అన్నారు. కట్టుతప్పిన వారిపై వెంటనే చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా ఈ అంశంపై శివసేనకు చెందిన మరో నేత కూడా మనీశా కూడా మాట్లాడారు. ఓటీటీ వేదికలు, యూట్యూబర్లు, కమెడియన్లపై కూడా సెన్సార్ షిప్ అవసరమని అన్నారు. రణ్‌వీర్ వ్యాఖ్యలను వల్గర్ కామెడీగా అభివర్ణించారు. ‘‘వాళ్లు హద్దులన్నీ మీరారు. ఇలాంటి వాళ్లను కచ్చితంగా శిక్షించాలి. సెన్సార్‌షిప్ ఉండాలి’’ అని అన్నారు.

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 12 , 2025 | 12:25 AM