గురువారం పార్లమెంటులో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు!
ABN , Publish Date - Feb 11 , 2025 | 09:28 PM
గతేడాది బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ పేర్కొన్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాల్లోని భాషను సరళీకరించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమీక్షకు పంపనున్నారట. కొత్త చట్టంలో ట్యాక్స్ రిబేట్, పన్ను శ్లాబుల మార్పులేవీ ఉండవని తెలుస్తోంది.
Ranveer Allahbadia: టీవీ షోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అల్లాహ్‌బాడియాపై కేసు!
ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాలను మరింత స్పష్టంగా, సులువుగా అర్థం చేసుకునే విధంగా భాషలో మార్పుల ద్వారా వివాదాలు, లిటిగేషన్లు తగ్గుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారలకు ఇన్‌ట్యాక్స్ చట్టంపై మరింత స్పష్టత వస్తుందని వెల్లడించాయి.
ఈ మార్పులను సమీక్షించేందుకు సూచనలు సలహాలు ఇచ్చేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీటీబీటీ) ఇప్పటికే అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఈ బిల్లులో వివిధ అంశాలను పరిశీలిచేందుకు 22 ప్రత్యేక సబ్ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. సుమారు ఆరు దశాబ్దాల నాటి చట్టాన్ని మరింత సరళీకరించేందుకు కేంద్రం ఈ బిల్లును సిద్ధం చేసింది.
అంతుకుముందు ప్రభుత్వం బిల్లుపై దేశంలో వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు కోరింది. ఈ సూచనలను భాషను సరళీకరించడం, లిటిగేషన్ తగ్గించడం, పాత, కాల చెల్లిన చట్టాలకు ముగింపు పలకడం వంటి కేటగిరీల్లో వర్గీకరించి సమీక్షించాక తగు మార్పులను బిల్లులో పొందుపరిచింది.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..