Rekha Gupta: సీఎం రేఖా గుప్తా
ABN, Publish Date - Feb 20 , 2025 | 05:08 AM
బుధవారం జరిగిన శాసననసభాపక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తను తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి బీజేపీ అధిష్టానం ప్రతినిధులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ కార్యదర్శి ఓం ప్రకాశ్ ధన్‌కర్ హాజరయ్యారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై వీడిన ఉత్కంఠ
తొలిసారి ఎమ్మెల్యేను వరించిన అదృష్టం
కలిసొచ్చిన ఆర్‌ఎ్‌సఎస్, ఏబీవీపీ నేపథ్యం
నేడు రామ్‌లీలా మైదానంలో ప్రమాణం
హాజరుకానున్న ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి19: ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠ వీడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా(50) ఎంపికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన శాసననసభాపక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తను తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి బీజేపీ అధిష్టానం ప్రతినిధులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ కార్యదర్శి ఓం ప్రకాశ్ ధన్‌కర్ హాజరయ్యారు. సీఎం రేసులో ముందున్నారని ప్రచారం జరిగిన పర్వేశ్ వర్మ, విజేంద్ర గుప్త ఆమె పేరును శాసనసభాపక్ష నాయకురాలిగా ప్రతిపాదించారు. ఆ వెంటనే ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. అనంతరం రేఖా గుప్త ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు సక్సేనా ఆమెను ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీయే పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
తొలిసారి ఎమ్మెల్యేకు అదృష్టం
1974 జులై 19న హర్యానాలోని జుల్నాలో రేఖా గుప్త జన్మించారు. ఆ తర్వాత రెండేళ్లకే ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీకి వచ్చారు. దీంతో ఆమె విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే సాగింది. 1992లో దౌలత్ రామ్ కాలేజీలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించారు. న్యాయవాద విద్యనభ్యసించారు. 1996-97లో ఏబీవీపీ తరఫున ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అధ్యక్షురాలిగా గెలిచారు. ఢిల్లీ పితంపురా కౌన్సిలర్‌గా గెలిచి, ఆ తర్వాత మేయర్‌గా పని చేశారు. 2015, 2020 ఎన్నికల్లో షాలీమార్ బాగ్‌లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో 29,595 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి వందనపై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఢిల్లీ నాలుగో మహిళా సీఎం
రేఖా గుప్తా ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా సేవలు అందించనున్నారు. గతంలో బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరఫున షీలాదీక్షిత్, ఆమ్ ఆద్మీ నుంచి అతిశీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Read More Business News and Latest Telugu News
ఇవి కూడా చదవండి:
Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 20 , 2025 | 05:08 AM