Sam Pitroda: చైనాను శత్రువుగా చూడొద్దు
ABN, Publish Date - Feb 18 , 2025 | 04:36 AM
ఆ దేశాన్ని శత్రువుగా పరిగణించరాదని.. దానిని గుర్తించి గౌరవించాలని, కలిసి నడవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.
మొదటి నుంచీ భారత్‌ది ఘర్షణ వైఖరి: శామ్ పిట్రోడా
ఆయన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: జైరాం రమేశ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: చైనాతో ఆది నుంచీ భారత్ ఘర్షణ వైఖరి అనుసరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఓవర్‌సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. ఆ దేశాన్ని శత్రువుగా పరిగణించరాదని.. దానిని గుర్తించి గౌరవించాలని, కలిసి నడవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆ దేశానికి, భారత వ్యతిరేక అమెరికన్ పారిశ్రామికవేత్త జార్జ్ సొరో్‌సకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తింది. దీంతో పిట్రోడా వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ ప్రకటించింది.
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారంలో మధ్యవర్తిత్వానికి అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 13న వైట్‌హౌ్‌సలో ప్రధాని మోదీతో సంయుక్త విలేకరుల సమావేశం సందర్భంగా ప్రతిపాదించడం.. దీనిని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తిరస్కరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిట్రోడా సోమవారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. చైనా పట్ల భారత్ తన వైఖరిని మార్చుకోవలసిన అవసరం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 18 , 2025 | 04:36 AM