Saif Ali Khan Stabbing Case: సైఫ్‌పై దాడి నిందితుడిని పట్టించిన యూపీఐ పేమెంట్
ABN, Publish Date - Jan 20 , 2025 | 02:49 PM
సైఫ్ ఆలీఖాన్‌పై దాడి నిందితుడు షహబాద్‌ను కనిపెట్టి అతన్ని పట్టుకునేందుకు ఒక లేబర్ కాంట్రాక్టర్ ముంబై పోలీసులకు సహకరించాడు. ఒక పోలీసు అధికారి కథనం ప్రకారం, విచారణలో భాగంగా దాదర్ రైల్వే పోలీస్ స్టేషన్ వెలుపల తిరుగుతూ నిందితుడు మూడు సార్లు కనిపించాడు.
ముంబై: నేరానికి పాల్పడిన వ్యక్తి ఎంత తెలివిగా తప్పించుకుని పారిపోయినా పోలీసుల డేగ కన్నుకు ఎక్కడో ఒక చిన్న అధారం దొరుకుతుంది. అదే అతన్ని పట్టిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali khan) నివాసంలోకి చొరబడి ఆయనపై కత్తితో దాడి చేసిన షరీఫుల్ ఇస్లామ్ షహజాద్ అలియాస్ విజయ్ దాస్‌ను కొద్ది గంటల్లోనే ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ఒక చిన్న క్లూ అతన్ని పోలీసులకు పట్టించింది.
Sanjay Rai: నేను ఏ తప్పు చేయలేదు.. నన్ను ఇరికించారు
యూపీఐ ట్రాన్సాక్షన్
షెహజాద్ తప్పించుకుని తిరుగుతున్న క్రమంలో యూపీఐ (UPI) ట్రాన్సాక్షన్ చేశాడు. ఈ ట్రాన్సాక్షన్‌ను ట్రేస్ చేసి పోలీసులు అతని మొబైల్ నెంబర్‌ను కనుగొన్నారు. అతను ఉన్న చోటును (location) గుర్తించారు. వెంటనే 100 మంది పోలీసులు రంగంలోకి దిగి అతన్ని నలువైపుల నుంచి చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకున్నారు.
లేబర్ కాంట్రాక్టర్ సాయంతో..
షహబాద్‌ను కనిపెట్టి అతన్ని పట్టుకునేందుకు ఒక లేబర్ కాంట్రాక్టర్ ముంబై పోలీసులకు సహకరించాడు. ఒక పోలీసు అధికారి కథనం ప్రకారం, విచారణలో భాగంగా దాదర్ రైల్వే పోలీస్ స్టేషన్ వెలుపల తిరుగుతూ నిందితుడు మూడు సార్లు కనిపించాడు. వోర్లి కోలివాడాకు అతను వెళ్లాడు. వందలాది సీసీటీవీ ఫుటేజ్‌లను పరీక్షించి ఆ ఏరియాలోని లేబర్ కాంట్రాక్టర్ వద్దకు అతను వెళ్లినట్టు కనిపెట్టారు. థానే జిల్లాలోని లేబర్ క్యాంప్‌లో అతన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు గతంలో థానేలోని ఓ హోటల్‌లో పనిచేశాడు. అతనిపై ఇంతవరకూ ఎలాంటి నేరచరిత్ర లేదు. నిందితుడు పరాటాలు, నీళ్ల బాటిల్స్ కోసం యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించినట్టు లేబర్ కాంట్రాక్టర్ సమాచారం ఇచ్చాడు. ఆ ఆధారంతో షహజాద్ ఫోన్ నెంబర్ గుర్తించి లొకేషన్ ట్రేస్ చేయడంతో అతని ఆటకట్టింది.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: పేదల హక్కుల కోసం ‘వైట్ టీషర్ట్’ ఉద్యమం
Saif Ali Khan: సైఫ్‌పై దాడి చేసింది బంగ్లాదేశీయుడు!
Read Latest National News and Telugu News
Updated Date - Jan 20 , 2025 | 02:49 PM