ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Parvesh Verma: సీఎం రేసులో పర్వేశ్‌వర్మ?

ABN, Publish Date - Feb 09 , 2025 | 04:40 AM

ఈయన ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడు. పర్వేశ్‌ వర్మ కేజ్రీవాల్‌పై 4వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది జెయింట్‌ కిల్లర్‌గా మారారు. ఇదే స్థానంలో పోటీ చేసిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ కేవలం 4,254 ఓట్లను మాత్రమే సాధించారు.

కేజ్రీవాల్‌పై 4 వేల ఓట్ల మెజారిటీతో విజయం

రేసులో బిధూరీ, మనోజ్‌ తివారీ, స్మృతి పేర్లూ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్‌ వర్మ పేరు ఢిల్లీ సీఎం రేసులో మొదటగా, ఎక్కువగా వినిపిస్తోంది. ఈయన ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడు. పర్వేశ్‌ వర్మ కేజ్రీవాల్‌పై 4వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది జెయింట్‌ కిల్లర్‌గా మారారు. ఇదే స్థానంలో పోటీ చేసిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ కేవలం 4,254 ఓట్లను మాత్రమే సాధించారు. ఇక, బీజేపీ ఢిల్లీ నేతల్లో కీలకమైన రమేశ్‌ బిధూరీ పేరు కూడా సీఎం రేసులో ఉంది. ఎన్నికల ప్రచారంలో సీఎం అతీశి తండ్రిపై బిధూరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అతీశి చేతిలో బిధూరీ ఓడిపోయారు. సీఎం రేసులో సుష్మా స్వరాజ్‌ కూతురు బాన్సురీ స్వరాజ్‌, స్మృతి ఇరానీ, మనోజ్‌ తివారీ, వీరేంద్ర సచ్‌దేవ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో పర్వేశ్‌ వర్మ ఒక్కరే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.


ఎవరీ వర్మ?

ముండ్కా నియోజకవర్గం నుంచి 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పర్వేశ్‌ వర్మ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 2014-2024 మధ్యలో పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్నారు. 2019లో రికార్డు స్థాయిలో 5.78లక్షల మెజారిటీతో గెలుపొందారు. అయితే, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో 2024లో ఆయనకు బీజేపీ టికెట్‌ నిరాకరించింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌పై పర్వేశ్‌ వర్మనే రంగంలోకి దించింది.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 04:40 AM