Organ donation: మెదడు నిర్జీవమైన యువకుడి అవయవ దానం
ABN, Publish Date - Jan 22 , 2025 | 11:33 AM
స్థానిక శ్రీపురం నారాయణి ఆస్పత్రి(Sripuram Narayani Hospital)లో తొలిసారిగా మెదడు నిర్జీవమైన యువకుడి అవయవాలు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఆనైకట్టు సమీపం మహమ్మద్‌పురానికి(Mohammedpuram) చెందిన అరుళ్ (24) గత వారం ద్విచక్రవాహనంపై వెళుతూ ప్రమాదంలో గాయపడ్డాడు.
వేలూరు(చెన్నై): స్థానిక శ్రీపురం నారాయణి ఆస్పత్రి(Sripuram Narayani Hospital)లో తొలిసారిగా మెదడు నిర్జీవమైన యువకుడి అవయవాలు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఆనైకట్టు సమీపం మహమ్మద్‌పురానికి(Mohammedpuram) చెందిన అరుళ్ (24) గత వారం ద్విచక్రవాహనంపై వెళుతూ ప్రమాదంలో గాయపడ్డాడు. అతడిని నారాయణి ఆస్పత్రికి తరలించగా, చికిత్స ఫలించక ఈ నెల 17న మెదడు నిర్జీవమైనట్లు వైద్యులు గుర్తించారు. వైద్యుల సూచనల మేరకు అరుళ్ అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
దీంతో, వైద్యుల బృందం శస్త్రచికిత్స ద్వారా తొలగించిన కిడ్నీ నారాయణి ఆస్పత్రికి, గుండె చెన్నై అపోలో, మరో కిడ్నీ చెన్నై కావేరి ఆస్పత్రి(Kidney Chennai Cauvery Hospital), నేత్రాలు వేలూరు సీఎంసీ ఆసుపత్రికి దానంగా అందజేశారు. వైద్యుల బృందంలో మెకనెస్ జయరాజ్, శివానందం, మనీ్‌సకుమార్, ఎయిల్‌నిలవన్ తదితరులున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందానికి ఆసుపత్రి డైరెక్టర్ డా.బాలాజి అభినందనలు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే
ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు!
Read Latest Telangana News and National News
Updated Date - Jan 22 , 2025 | 11:33 AM