ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

FASTag: ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ లేకుంటే.. డబుల్‌ టోల్‌ బాదుడు

ABN, Publish Date - Feb 18 , 2025 | 04:46 AM

బ్లాక్‌లిస్టులో ఉన్న కార్డును వాడినా.. జరిమానాల బాదుడు తప్పదు. ఈ మేరకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్‌పీసీఐ) కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి.

బ్లాక్‌ లిస్టులో ఉన్నా జరిమానా

అమల్లోకి కొత్త నిబంధనలు: ఎన్‌పీసీఐ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఫాస్టాగ్‌ వినియోగదారులు ఇకపై బ్యాలెన్స్‌ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. టోల్‌ చార్జీకి తగిన బ్యాలెన్స్‌ లేకున్నా.. బ్లాక్‌లిస్టులో ఉన్న కార్డును వాడినా.. జరిమానాల బాదుడు తప్పదు. ఈ మేరకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్‌పీసీఐ) కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. టోల్‌బూత్‌ల వద్ద వాహనాల రద్దీకి బ్లాక్‌లిస్ట్‌ ఫాస్టాగ్‌లు, లోబ్యాలెన్స్‌ వంటి అంశాలు కారణాలుగా ఉంటున్న నేపథ్యంలో.. తాజా నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది. ఫాస్టాగ్‌ ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ (రూ.100) లేకపోతే.. దాన్ని రీచార్జ్‌ చేయకుంటే బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. ఫాస్టాగ్‌ అందించే బ్యాంకుకు సమయానికి కేవైసీ అందించకున్నా.. వాహన రిజిస్ట్రేషన్‌ వివరాల్లో తేడాలున్నా బ్లాక్‌లిస్ట్‌ లేదా హాట్‌లిస్టులో పెడతారు.


ఒకవేళ బ్లాక్‌లిస్టులో ఫాస్టాగ్‌ ఉంటే.. టోల్‌బూత్‌ను చేరుకోవడానికి 60 నిమిషాల ముందే రీచార్జ్‌ చేసుకుని, కేవైసీని సమర్పించి.. అన్‌బ్లాక్‌ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా.. బ్లాక్‌లిస్టులో ఉండగానే టోల్‌ దాటితే.. ‘ఎర్రర్‌ కోడ్‌ 176’గా పరిగణిస్తారు. దీంతో.. టోల్‌ చార్జీకి సమానంగా జరిమానా పడుతుంది. అంటే.. టోల్‌ చార్జీకి రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఎర్రర్‌ కోడ్‌ 176 వచ్చినప్పుడు.. 10 నిమిషాల్లోపు రీచార్జ్‌/అన్‌బ్లాక్‌ చేసుకుంటే.. జరిమానా మొత్తం వెనక్కి వస్తుంది. ఈ నేపథ్యంలో సేవింగ్‌ అకౌంట్స్‌ ఉన్న బ్యాంకు నుంచే ఫాస్టాగ్‌ తీసుకుంటే.. యాప్‌లో ‘ఆటో రీచార్జ్‌’ విధానాన్ని అనుసరించడం మంచిది. అంటే.. బ్యాలెన్స్‌ మొత్తం రూ.200 లేదా రూ.300 కంటే తక్కువ ఉంటే.. నిర్ణీత మొత్తాన్ని ఖాతా నుంచి ఆటో రీచార్జ్‌ అయ్యేలా సెట్టింగ్స్‌లో ఆప్షన్లను ఎంచుకోవచ్చు.


ఇవి కూడా చదవండి..

గోల్డ్‌ బాండ్లకు గుడ్‌బై..

ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు

మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 18 , 2025 | 04:46 AM