ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Tax Regime : 12.75 లక్షల దాకా.. పన్ను లేదు!

ABN, Publish Date - Feb 02 , 2025 | 04:56 AM

ఆదాయపన్ను పరిమితి పెంపుపై కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న వేతనజీవులు, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. మూలధన లాభాల వంటి ప్రత్యేక పన్ను రేటు వర్తించే ఆదాయాలు మినహా రూ.12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు కొత్త విధానం ప్రకారం అసలు పన్నే చెల్లించాల్సిన పని

పాత పన్ను విధానం జోలికే పోని నిర్మల

కొత్త విధానంలో ఉన్న శ్లాబుల పెంపుపన్ను రిబేటు పరిమితి పెంపుతో భారీగా లబ్ధి..

రూ.12.75 లక్షలకు మించి ఒక్క రూపాయిఎక్కువ ఆదాయం ఉన్నా రూ.4 లక్షల నుంచీ పన్ను

ఈ సవరింపులతో సర్కారుకు రూ.లక్ష కోట్ల మేర ప్రత్యక్ష పన్నుల ఆదాయం తగ్గుతుందన్న ఆర్థికమంత్రి

పన్ను మినహాయింపు పరిధిలోకి మరో కోటిమంది!

ఇకపై రెండో గృహానికీ పన్ను ప్రయోజనాలు .. ఎన్‌పీఎ్‌స వాత్సల్య కింద రూ.50 వేల మినహాయింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆదాయపన్ను పరిమితి పెంపుపై కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న వేతనజీవులు, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. మూలధన లాభాల వంటి ప్రత్యేక పన్ను రేటు వర్తించే ఆదాయాలు మినహా రూ.12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు కొత్త విధానం ప్రకారం అసలు పన్నే చెల్లించాల్సిన పని లేకుండా వెసులుబాటు కల్పించారు. ఆ ఆదాయానికి రూ.75 వేల ప్రామాణిక తగ్గింపును కూడా కలుపుకొంటే.. రూ.12.75 లక్షల దాకా పన్ను చెల్లించక్కర్లేదు సరికదా.. వారికి ప్రస్తుత విధానంతో పోలిస్తే పన్ను రిబేటు రూపంలో అత్యధికంగా రూ.80 వేల మేర ఆదాయపన్ను లబ్ధి చేకూరుతుంది. అయితే, ఈ కొత్త పన్ను శ్లాబులు 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. కాగా.. కొత్త పన్ను విధానాన్ని ఇంత భారీగా సవరించిన నిర్మలమ్మ.. పాత పన్ను విధానం జోలికే పోకపోవడం గమనార్హం. ప్రజల ఆకాంక్షలకు స్పందించి తాము తీసుకున్న మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని.. వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుందని ఆమె పేర్కొన్నారు. పన్ను రిబేటు పరిమితిని ఇంతగా పెంచడం వల్ల మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని.. ఫలితంగా సర్కారుకు రూ.లక్ష కోట్ల మేర ప్రత్యక్ష, రూ.2600 కోట్ల మేర పరోక్ష పన్నుల ఆదాయం తగ్గుతుందని వివరించారు. ప్రజల చేతిలో ఉండే ఈ డబ్బు.. గృహవినియోగాన్ని, పొదుపును, పెట్టుబడులను పెంచుతుందని ఆమె పేర్కొన్నారుగానీ.. ప్రజలు ఎంత పొదుపు చేసినా కొత్త పన్ను విధానం ప్రకారం ఎలాంటి మినహాయింపులూ వర్తించవు కాబట్టి చాలా మంది ఆ డబ్బును ఖర్చు చేయడానికే వినియోగిస్తారని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఆదాయం రూ.12 లక్షలు దాటితే?

ఆర్థిక మంత్రి తాజా ప్రతిపాదన ప్రకారం వార్షిక సంపాదన రూ.12 లక్షల వరకూ పన్ను లేదు సరే.. అంతకుమించి ఆదాయం వస్తే? అప్పుడు ఆ ఆదాయంలో మొదటి రూ.4 లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించక్కర్లేదు. రూ.4,00,001 నుంచి వివిధ శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. కిషోర్‌ అనే ప్రైవేటు ఉద్యోగి నెల జీతం రూ.లక్ష అనుకోండి. అంటే వార్షిక ఆదాయం రూ.12 లక్షలు కాబట్టి.. కొత్త విధానం ప్రకారం అతడు వచ్చే ఆర్థిక సంవత్సరంలో పైసా పన్ను చెల్లించక్కర్లేదు. ఆ తర్వాత అతడి జీతం రూ.10 వేల మేర పెరిగి.. రూ.1.1 లక్షలు అయ్యిందనుకుంటే.. వార్షిక వేతనం రూ.13,20,000 అవుతుంది. అప్పుడు కొత్త విధానం ప్రకారం.. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పోను రూ.12.45 లక్షలకు పన్ను కట్టాల్సి వస్తుంది. అందులో మొదటి రూ.నాలుగు లక్షలకూ ఎలాంటి పన్నూ ఉండదు. రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా 5 శాతం పన్ను, రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల దాకా 10ు, మిగిలిన రూ.45 వేలకు 15ు పన్ను చొప్పున.. సుంకాలను కలుపుకొని మొత్తం రూ.రూ.26 వేలు కట్టాల్సి వస్తుంది.

వారికి భారీ లబ్ధి..

భారతీయులకు అలవాటైన ‘పొదుపు’ నుంచి మళ్లించి.. వారితో ఎక్కువ ఖర్చు పెటిం్టచడమేలక్ష్యంగా 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి నిర్మలా సీతారామన్‌ కొత్త పన్ను విధానాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, పాత పన్ను విధానంలో లభించే మినహాయింపుల కారణంగా చాలా మంది దానికే అంటిపెట్టుకుని ఉండడంతో.. వారిని కొత్త విధానం వైపు మళ్లించేందుకు ఆమె ఆ తర్వాతి సంవత్సరాల్లో రకరకాల ప్రయోగాలు చేశారు. అందులో భాగంగానే గత ఏడాది సైతం కొత్త పన్ను విధానంలో శ్లాబుల సంఖ్యను మార్చారు. పన్ను కట్టక్కర్లేని ఆదాయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచేశారు. ఇప్పుడా పన్ను శ్లాబులను ఏడుకు పెంచారు. అలాగే.. ప్రస్తుతం అమల్లో ఉన్న కొత్త పన్ను విధానం ప్రకారం రూ.15 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారు 30ు పన్ను చెల్లించాలి. నిర్మల తాజాగా 30ు పన్ను చెల్లించాల్సిన పరిమితిని ఏకంగా రూ.24 లక్షలకు పెంచుతూ ప్రతిపాదన చేశారు. అంతేకాదు.. రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల శ్లాబు (20ు పన్ను), రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల శ్లాబులను (25ు పన్ను) కూడా అందుబాటులోకి తెచ్చారు. కాబట్టి రూ.15 లక్షల నుంచి రూ.24 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారికి కొత్త పన్ను విధానం ప్రకారం భారీగా లబ్ధి చేకూరనుంది. పాత పన్ను విధానంలో శ్లాబులను యథాతథంగా ఉంచిన నిర్మలమ్మ.. ఆ విధానంలో ఉన్నవారికి ఒకే ఒక్క ఊరట కల్పించారు. నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌లో పొదుపుచేస్తే లభించే పన్ను ప్రయోజనాలను.. ఎన్‌పీఎ్‌స వాత్సల్యలో జమ చేసేవారికీ కల్పించాలనే ప్రతిపాదన చేశారు. తల్లిదండ్రులు, లేదా సంరక్షకులు పిల్లల కోసం ఎన్‌పీఎ్‌స ఖాతాలు ప్రారంభించే అవకాశం కల్పించే పథకమే ఈ ‘ఎన్‌పీఎ్‌స వాత్సల్య’. 2024 సెప్టెంబరులో ఈ పథకం ప్రారంభమైంది. దీనికింద తల్లిదండ్రులు/సంరక్షకులు పిల్లల పేరిట ఏడాదికి కనీసం రూ.1000 జమ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఆ పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చాక ఆ ఖాతా పూర్తిగా వారి పేరిట మారుతుంది. తాజాగా నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రతిపాదన ప్రకారం ఈ పథకంలో చేసే ‘జమ’లకు రూ.50 వేల దాకా పన్ను మినహాయింపు పొందొచ్చు.


రెండో ఇంటికీ..

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. రెండు ఇళ్లు ఉన్నవారు వాటిలో ఒక ఇంటిని మాత్రమే సెల్ఫ్‌ ఆక్యుపైడ్‌ (స్వీయ ఆక్రమిత) నివాసంగా చూపే అవకాశం ఉంది. రెండో ఇంటిని అద్దెకు ఇవ్వకున్నా.. ఇచ్చినట్టుగా భావించి ఆ నోషనల్‌ అద్దె ఆదాయంపై పన్ను కట్టాల్సి వచ్చేది. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండో ఇంటిని కూడా తాము నివాసం ఉంటున్న ఇల్లుగా క్లెయిమ్‌ చేసుకుని పన్ను ప్రయోజనాలను పొందేవీలు నిర్మలా సీతారామన్‌ కల్పించారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో సొంత ఇంటిలో నివాసం ఉండే రామారావుకు.. విజయవాడలోనూ మరో ఇల్లు ఉంది. అందులో అతడి తల్లిదండ్రులు నివాసం ఉంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం విజయవాడ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టుగా భావించి దానిపై అతడు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇది అతడిపై భారమే. కానీ, నిర్మలా సీతారామన్‌ శనివారం బడ్జెట్‌లో చేసిన కొత్త ప్రతిపాదన ప్రకారం అతడు ఆ ఇంటిని కూడా తాను నివాసం ఉండే ఇల్లుగానే పేర్కొనవచ్చు. నోషనల్‌ అద్దెపై పన్ను చెల్లించాల్సిన పని లేదు. అలాగే.. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో మార్పుచేర్పులు చేసి, సవరించిన రిటర్నులు దాఖలు చేయడానికి ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్టు నిర్మల పేర్కొన్నారు. సవరించిన రిటర్నుల దాఖలుకు అవకాశం కల్పిస్తూ తాము తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్నిచ్చిందని.. ఇప్పటిదాకా దాదాపు 90 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా తమ రిటర్నులను సవరించి, అదనపు పన్నులను చెల్లించారని ఆమె వివరించారు.

పాత పన్ను విధానంలో శ్లాబులు

ఆదాయం పన్ను %

రూ.0-2.5 లక్షలు 0

రూ.2.5-5 లక్షలు 5

రూ.5-10 లక్షలు 20

రూ.10 లక్షల పైన 30


పింఛను లెక్క(రూ.కోట్లలో)

2023-24 2,38,328 (రూ.కోట్లలో)

2024-25 2,75,103 (రూ.కోట్లలో)

2025-26 2,76,618 (రూ.కోట్లలో)


Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే

Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..

Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 06:14 AM