Bihar Poll Prediction: బీహార్ ఎన్నికల్లోనూ సర్‌ప్రైజ్ తప్పదు: ప్రశాంత్ కిశోర్
ABN, Publish Date - Feb 11 , 2025 | 10:03 PM
రాబోయే బీహార్ ఎన్నికల్లో సర్‌ప్రైజ్ తప్పదని జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే గెలిచినా ఓడినా నితీశ్ కుమార్ మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగరని స్పష్టం చేశారు
ఇంటర్నెట్ డెస్క్: రాబోయే బీహార్ ఎన్నికల్లో సర్‌ప్రైజ్ తప్పదని జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే గెలిచినా ఓడినా నితీశ్ కుమార్ మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగరని స్పష్టం చేశారు.
‘‘నితీశ్ కుమార్ శారీరకంగా అలసిపోయారు. మానసికంగా రిటైర్ అయిపోయారు. తన కేబినెట్ మంత్రులు, శాఖల పేర్లు కూడా చెప్పే స్థితిలో లేదు. కాబట్టి, ఎన్నికలు విజయాలు భారీ విషయాలుగా మారతాయి’’ అని వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్ సీఎం కాబట్టి అక్కడి వ్యవస్థలు ఆయను ఎలాగొలా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయని అన్నారు. భారీ స్థాయిలో రాజకీయ శ్రమ చేసే స్థితిలో ఆయన లేరని అన్నారు.
గురువారం పార్లమెంటులో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు!
ఇక బీహార్‌లోని ఎన్డీయే కూటమి బీజేపీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని అన్నారు. నితీశ్ కుమార్ ప్రస్తుతం ఓ మాస్కులాగా ఉండిపోయారని అన్నారు. ‘‘సీట్ల పంపకాలు వచ్చే సరికి జేడీయూ 100 సీట్ల కోసం పట్టుపట్టొచ్చు. ఇక 2025లో ఎన్డీయే గెలిచినా నితీశ్ కుమార్ మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగరు. బీజేపీ తన ముఖ్యమంత్రిని రంగంలోకి దింపుతుంది.
Ranveer Allahbadia: టీవీ షోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అల్లాహ్‌బాడియాపై కేసు!
అయితే, బీహార్ రాజకీయాలను తనంతట తానుగా శాసించే స్థితిలో ప్రస్తుతం బీజేపీ లేదని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. ‘‘లోక్‌సభ ఎన్నికల తరువాత 5 సార్లు ఉపఎన్నికలు జరిగాయి. ఎన్డీయే నాలుగింటిల్లో ఓడిపోయింది. బీహార్‌లో ఎన్డీయే ఓటరైనా, ఆర్జేడీ ఓటరైనా ముగ్గురిలో ఇద్దరు మార్పు కోరుకుంటున్నారు’’ అని ఆయన అన్నారు. బీజేపీ హర్యానా, మహారాష్ట్రలో గెలిచినా బీహార్‌లో మాత్రం అంత ప్రభావవంతమైనది కాదన్నారు. బీహార్ అంటే ఢిల్లీలో హర్యానాలో కాదని వ్యాఖ్యానించారు. బీహార్ రాజకీయాలు, సమస్యలు వేరని అన్నారు. అక్కడ బీజేపీ బలం కూడా భిన్నమైనదని చెప్పుకొచ్చారు. కేవలం ఒక్కసారి మాత్రమే బీజేపీ బీహార్‌లో 150 సీట్లల్లో పోటీ చేసిందని గుర్తు చేశారు. సాధారణ 100 సీట్లలోపే తన పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 11 , 2025 | 10:03 PM