ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paragliding: పారాగ్లైడింగ్‌ ద్వారా పరీక్ష కేంద్రానికి

ABN, Publish Date - Feb 18 , 2025 | 04:48 AM

పారాగ్లైడింగ్‌ ద్వారా పరీక్షాకేంద్రానికి చేరుకున్నాడు. మహారాష్ట్రలో సతారా జిల్లా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్‌ బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పంచగనిలో వారాంతాల్లో ఓ జ్యూస్‌ షాప్‌ నడుపుతున్నాడు.

మహారాష్ట్రలో విద్యార్థి వినూత్న ఆలోచన

ముంబై, ఫిబ్రవరి 17: ఓవైపు పరీక్షకు సమయం మించిపోతోంది. మరోవైపు రోడ్డుపై ట్రాఫిక్‌. దాంతో పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకునేందుకు ఓ విద్యార్థి విన్నూత దారిని ఎంచుకున్నాడు. పారాగ్లైడింగ్‌ ద్వారా పరీక్షాకేంద్రానికి చేరుకున్నాడు. మహారాష్ట్రలో సతారా జిల్లా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్‌ బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పంచగనిలో వారాంతాల్లో ఓ జ్యూస్‌ షాప్‌ నడుపుతున్నాడు. ఇటీవల ఓ రోజు సమర్థ్‌ ఆ షాపులో ఉన్న సమయంలో అతడి స్నేహితులు ఫోన్‌ చేసి పరీక్షకు సమయమవుతోంది ఎక్కడ ఉన్నావని అడిగారు. దాంతో సమర్థ్‌కు ఏమీ పాలుపోలేదు.


వాయిదా పడిన ఓ పరీక్ష ఆ రోజు నిర్వహిస్తున్న సంగతి అతడికి తెలియదు. దాంతో కంగారుపడ్డాడు. తాను ఉన్న దగ్గరి నుంచి పరీక్షాకేంద్రానికి వెళ్లేందుకు పావుగంట సమయం మాత్రమే ఉంది. ట్రాఫిక్‌ రద్దీ నేపథ్యంలో 15 కి.మీల దూరంలోని పరీక్షా కేంద్రానికి రోడ్డు మార్గంలో వెళ్తే సమయానికి చేరుకోలేనని సమర్థ్‌ గ్రహించాడు. దాంతో పంచగని జీపీ అడ్వెంచర్స్‌లో గోవింద్‌ యేవాలే అనే సాహస క్రీడల నిపుణుడిని తనను పారాగ్లైడింగ్‌ ద్వారా పరీక్ష కేంద్రానికి చేర్చాలని అభ్యర్థించాడు. గోవింద్‌ తన బృందం సహాయంతో పారాగ్లైడింగ్‌ ద్వారా సమర్థ్‌ను సమయానికి పరీక్ష కేంద్రానికి పంపారు.


ఇవి కూడా చదవండి..

గోల్డ్‌ బాండ్లకు గుడ్‌బై..

ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు

మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 18 , 2025 | 04:49 AM