ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ranveer Allahbadia: టీవీ షోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అల్లాహ్‌బాడియాపై కేసు!

ABN, Publish Date - Feb 11 , 2025 | 07:40 PM

ఓ టీవీ షోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాహ్‌బాడియాపై మహారాష్ట్ర పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇండియా గాట్ లాటెంట్ టీవీ షోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాహ్‌బాదియాతో పాటు ఇతర యూట్యూబర్లు ఆశిశ్ చంచ్లానీ, అపూర్వ ముఖీజా తదితరులపై మహారాష్ట్రలో బుధవారం కేసు నమోదైంది. సైబర్ బ్రాంచ్ పోలీసులు ఆ షో ఫుటేజీని పరిశీలించిన అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. మొత్తం 30 మంది కేసు నమోదు చేశారు. వీరిలో నటి రాఖీ సావంత్ కూడా ఉన్నారు. కేసు నమోదైన వాళ్లల్లో కొందరిని విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసినట్టు తెలిపారు. మరికొందరికి త్వరలో సమన్లు పంపిస్తామని అన్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67 (అసభ్యకర కంటెంట్‌ను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వ్యాప్తి చేయడం) కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


J and K IED Blast: జమ్మూకశ్మీర్‌లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు సైనికుల మృతి

కాగా, షోలో రణ్‌వీర్ వ్యాఖ్యలు వైరల్ కాగా చర్యలు తప్పవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ‘‘ప్రతి ఒక్కరికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది. కానీ అవతిలి వారి స్వేచ్ఛను భంగం వాటిల్లే సమయంలో మన స్వేచ్ఛకు ముగింపు పడుతుంది’’ అని హెచ్చరించారు. అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి రణ్‌వీర్‌పై నమోదైన రెండో కేసు ఇది. అంతకుముందు అస్సామ్ పోలీసులు కూడా రణ్‌వీర్‌తో పాటు సమయ్ రాణాపై కేసు నమోదు చేశారు. అసభ్యతను ప్రోత్సహించడం, వల్గర్ చర్చకు దిగడం తదితర అభియోగాలను మోపారు.


Narendra Modi: భారత్ ఇంధన పరివర్తన.. ప్రపంచ గేమ్ ఛేంజర్

మరోవైపు, ఈ వివాదంపై మొదట్లోనే రణ్‌వీర్ బేషరతుగా క్షమాపణ తెలిపారు. తన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, కామెడీ చేయడం తనకు చేతకాదని అన్నాడు. ‘‘నా వ్యాఖ్యలు కేవలం అభ్యంతరకరమే కాదు, అవి ఫన్నీ కూడా కాదు. కామెడీ నాకు రాదు. కాబట్టి నేను క్షమాపణలు చెబుతున్నాను. నా వ్యాఖ్యలకు ఎటువంటి సంజాయిషీ, సమర్థింపు ఇవ్వట్లేదు’’ అని అన్నాడు. ఇదిలా ఉండే రణ్‌వీర్‌పై విమర్శలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. అతడి కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను తొలగించాలంటూ జాతీయ మానవహక్కుల కమిషన్ యూట్యూబ్‌కు లేఖ రాసింది.

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 11 , 2025 | 07:42 PM