Narendra Modi: భారత్ ఇంధన పరివర్తన.. ప్రపంచ గేమ్ ఛేంజర్
ABN , Publish Date - Feb 11 , 2025 | 01:45 PM
భారతదేశ ఇంధన పరివర్తన నిర్ణయం కేవలం జాతీయ ప్రయత్నం మాత్రమే కాదు, ప్రపంచ గేమ్ ఛేంజర్ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచ ఇంధన భవిష్యత్తును మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 2030 నాటికి భారతదేశం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. మంగళవారం ఇండియా ఎనర్జీ వీక్ 2025 కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన క్రమంలో.. దేశం కొత్త ఇంధన భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించారు. ఈ క్రమంలో 2030 నాటికి 500 GW పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశం వృద్ధికి చాలా కీలకమన్నారు. ఈ దశాబ్దాలలో ఎంతో ప్రగతిని సాధిస్తామని మోదీ అన్నారు.
లక్ష్యాన్ని సాధించేందుకు..
ఇదే సమయంలో భారత రైల్వేలు 2030 నాటికి జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నాయన్నారు. అదనంగా ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి దేశంగా ఉంది. ఈ క్రమంలో శిలాజేతర ఇంధన శక్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచినట్లు ప్రధాని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇథనాల్ మిశ్రమ వినియోగం 19 శాతం పెరిగిందని, 2025 నాటికి 20 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ చెప్పారు.
వేగవంతమైన వృద్ధి..
ఈ క్రమంలో ఇండియా బయోఫ్యూయల్ విభాగంలో 500 మిలియన్ మెట్రిక్ టన్నుల ఫీడ్‌స్టాక్ మద్దతుతో వేగవంతమైన వృద్ధిని సాధించగలదని మోదీ ధీమా వ్యక్తం చేశారు. G20 అధ్యక్షత వహించిన సమయంలో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ స్థాపించారు. ఇప్పటివరకు 28 దేశాలు, 12 అంతర్జాతీయ సంస్థలు దీనిలో చేరాయి. ఈ నేపథ్యంలో భారతదేశం తన హైడ్రోకార్బన్ వనరులను మరింత సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మోదీ. భారతదేశం గ్యాస్ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తూ, సహజ వాయువు రంగంలో అధిక శాతం వాటా పొందేందుకు ప్రయత్నాలు చేస్తోందని మోదీ అన్నారు.
కొత్త నిర్ణయాలు
ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద శుద్ధి కేంద్రంగా ఉంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి 21వ శతాబ్దం భారతదేశం శతాబ్దంగా మారుతుందన్న వాదనను పునరుద్ధరించారు ప్రధాని. ఈ నేపథ్యంలో భారతదేశం సొంత వృద్ధిని మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా నడిపించడంలో కీలక పాత్ర పోషించనుందన్నారు. శక్తి రంగంలో తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు, పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి రంగాలలో పునర్నిర్మాణం ద్వారా ప్రపంచ ఇంధన వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషించడానికి అవకాశం ఉందన్నారు మోదీ. ఈ క్రమంలో భారత్ ఇంధన పరివర్తన ప్రపంచ స్థాయిలో కొత్త మార్గాలను నిర్మిస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి:
Maharashtra: 167 బారే సిండ్రోమ్ కేసులు నమోదు.. ప్రభుత్వం అలర్ట్..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..
Read More Business News and Latest Telugu News