ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumbh Mela: అసౌకర్యం కలిగితే క్షమించండి

ABN, Publish Date - Feb 28 , 2025 | 04:31 AM

ఈ నేపథ్యంలో కుంభమేళాను ‘ఐక్యతా మహాయజ్ఞం’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. శతాబ్దాల అణచివేతకు ముగింపు, కొత్త శకం ఆవిర్భావానికి ఇది గుర్తు అని పేర్కొన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులు అసౌకర్యానికి గురైతే క్షమించాలని కోరారు.

ఐక్యతా మహాయజ్ఞం.. మహా కుంభమేళా

మేనేజ్‌మెంట్‌, ప్లానింగ్‌ నిపుణులకు ఇదో అధ్యయనాంశం

ప్రపంచంలో దీనికి సమానమైన ఉదాహరణ మరోటి లేదు: మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45రోజుల పాటు సాగిన మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. ఈ నేపథ్యంలో కుంభమేళాను ‘ఐక్యతా మహాయజ్ఞం’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. శతాబ్దాల అణచివేతకు ముగింపు, కొత్త శకం ఆవిర్భావానికి ఇది గుర్తు అని పేర్కొన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులు అసౌకర్యానికి గురైతే క్షమించాలని కోరారు. కుంభమేళా గురించి ప్రధాని గురువారం తన బ్లాగులో రాశారు. ‘మహా కుంభమేళా ముగిసింది. ఐక్యత మహా యజ్ఞం పూర్తయింది. ఒక జాతి మేల్కొన్నప్పుడు, వందల సంవత్సరాల నాటి బానిస మనస్తత్వ సంకెళ్లను విచ్ఛిన్నం చేసి, కొత్త చైతన్యంతో శ్వాస తీసుకోవడం ప్రారంభించినప్పుడు.. జనవరి 13నుంచి ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఐక్యత మహాకుంభ్‌లో మనం చూసిన దృశ్యమే కనిపిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఈ కుంభమేళా ఐక్యతకు ప్రతీక. గత 45 రోజులుగా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రతిరోజూ సంగమ తీరానికి తరలి వచ్చారు. పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానం చేయాలన్న భావోద్వేగాల ప్రభంజనం భక్తుల్లో పెరుగుతూనే ఉంది.


గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ప్రతి భక్తుడిలోనూ ఉత్సాహాన్ని, శక్తిని నింపుతోంది. కుంభమేళా నేటి ఆధునిక యుగంలో ప్రణాళికలు, విధానాల రూపకల్పన నిపుణులతో పాటు మేనేజ్‌మెంట్‌ నిపుణులకు ఒక కొత్త అధ్యయన అంశంగా మారింది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మొత్తం ప్రపంచంలో దేనితోనూ పోల్చలేం. దీనికి సమానమైన ఉదాహరణ మరొకటి లేదు’ అని మోదీ రాసుకొచ్చారు. ‘సంగమ తీరానికి ఇన్ని కోట్లమంది ప్రజలు ఎలా వచ్చారా అని యావత్‌ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఈ కోట్లాది మందికి ఎవరూ అధికారికంగా ఆహ్వానాలు పంపలేదు. అయినా కుంభమేళాకు వచ్చిన ప్రజలు పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు చేశారు, అమెరికా జనాభా కంటే దాదాపు రెట్టింపు మంది పుణ్య స్నానాలు ఆచరించారు. భవిష్యత్తులో దీనినుంచి ప్రేరణ పొంది ఇదే విశ్వాసం, ఐక్యతతో ముందుకు సాగాలి’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహా కుంభమేళాను విజయవంతం చేసినందుకు యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని, ప్రయాగ్‌రాజ్‌ ప్రజలను ప్రధాని ప్రశంసించారు.


ప్రపంచ స్థాయి కార్యక్రమం: సీఎం యోగి

మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కొనియాడారు. ఇదో ప్రపంచ స్థాయి కార్యక్రమం అని పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ప్రధాని దార్శనికత, దూరదృష్టి తమకు సహాయపడ్డాయని తెలిపారు.


మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్

For National News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 04:31 AM