ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Digital Regulation: ఆన్‌లైన్‌ కంటెంట్‌ నియంత్రణకు కఠిన నిబంధనలు!

ABN, Publish Date - Feb 23 , 2025 | 05:03 AM

ఆ మేరకు ఆన్‌లైన్‌ కంటెంట్‌పై నిఘాను తీవ్రతరం చేయనున్నట్టు సంకేతాలిచ్చింది. అందుకోసం చట్టంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను కేంద్ర సమాచార, ప్రసార మాధ్యమాల మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది.

పరిశీలిస్తున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: యూట్యూబ్‌లో రణ్‌వీర్‌ అలహాబాదియా షో వివాదాస్పదమైన నేపథ్యంలో డిజిటల్‌ వేదికలపై హానికరమైన కంటెంట్‌ నియంత్రణకు కొత్త లీగల్‌ ఫ్రేమ్‌వర్‌ ్కను తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు ఆన్‌లైన్‌ కంటెంట్‌పై నిఘాను తీవ్రతరం చేయనున్నట్టు సంకేతాలిచ్చింది. అందుకోసం చట్టంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను కేంద్ర సమాచార, ప్రసార మాధ్యమాల మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది. బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ రాసిన లేఖకు ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మాధ్యమాల మంత్రిత్వశాఖ సమాధానమిచ్చింది. ‘డిజిటల్‌ వేదికలపై అసభ్యకరమైన, హింసాత్మక కంటెంట్‌ను ప్రదర్శించడానికి భావ వ్యక్తీకరణ అనే రాజ్యాంగ హక్కును దుర్వినియోగం చేస్తుండటంపై సమాజంలో ఆందోళన పెరుగుతోంది.


దీని నియంత్రణకు ప్రస్తుత చట్టాల్లో నిర్ధిష్టమైన నిబంధనలు ఉన్నాయి. హానికరమైన కంటెంట్‌ను నియంత్రించేందుకు మరింత కఠినమైన, సమర్థవంతమైన లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌ కోసం డిమాండ్‌ పెరుగుతోంది. తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుతం ఉన్న చట్ట నిబంధనలను పరిశీలిస్తున్నాం’ అని ఆ సమాధానంలో మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా, రణవీర్‌ అలహాబాదియాపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించడానికి ఏమైనా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలహాబాదియా వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్లమెంటరీ కమిటీ కూడా ఈనెల 13న కేంద్ర సమాచార ప్రసారమాద్యమాల శాఖకు లేఖ రాసింది. నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మీడియా వేదికల్లో వచ్చే వివాదాస్పద కంటెంట్‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని లేఖలో సూచించింది.


ఇవి కూడా చదవండి..

Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2025 | 05:03 AM