Viral: లీవ్ దొరకలేదని రెచ్చిపోయిన ప్రభుత్వ ఉద్యోగి.. కత్తితో దాడి!
ABN, Publish Date - Feb 06 , 2025 | 10:53 PM
తనకు సెలవు దొరకలేదన్న కోపంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి సహోద్యోగులపై దాడికి తెగబడ్డ ఘటన పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: అవసరమైన సమయంలో సెలవు దొరక్కపోతే ఏ ఉద్యోగికైనా ఇబ్బందే. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగులు కాస్త చికాకు పడినా ఆ తరువాత సర్దుకుపోతారు. కొన్నాళ్లకు విషయాన్ని మర్చిపోతారు. కానీ పశ్చిమబెంగాల్‌లోని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. సాటి ఉద్యోగులపై విచక్షణా రహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు.
ఢిల్లీ ఫలితాలపై యాక్సిస్ మై ఇండియా అంచనా ఇదే.. సునామీ సృష్టించనున్న ఆ పార్టీ
నిందితుడు అమిత్ సర్కార్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. న్యూ టౌన్ టెక్నికల్ బిల్డింగ్‌లో ఈ దాడి జరిగింది. అక్కడి సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి తెగబడ్డ అతడు ఆ తరువాత కత్తిని ప్రదర్శి్స్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడిలో డిపార్ట్‌మెంట్‌లోని నలుగురు ఉద్యోగులు గాయాలపాలయ్యారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Delhi Assembly Elections: ఢిల్లీలో మేము ఓడిపోతాం.. గెలుపు ఆపార్టీదే.. తేల్చేసిన కాంగ్రెస్ అగ్రనేత
తన సెలవుకు సంబంధించిన ఫైలును అడ్డుకున్నారనే విషయంలో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. ఇక నిందితుడికి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూడా స్పష్టత లేదు. నిందితుడు పోలీసులను కూడా బెదిరించినట్టు సమాచారం. ఇక ఘటన తాలూకు వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Updated Date - Feb 06 , 2025 | 10:53 PM