ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Delhi zoya Khan: ఏళ్ల తరబడి తప్పించుకుని తిరిగిన ఢీల్లీ లేడీ డాన్ ఎట్టకేలకు అరెస్టు

ABN, Publish Date - Feb 21 , 2025 | 12:23 PM

ఢిల్లీకి చెందిన పేరు మోసిన లేడీ డాన్ జోయా ఖాన్‌ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. మాదకద్రవ్యాలు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: పై ఫొటోల్లోని మహిళను చూశారుగా.. ఈమె మోడల్ అనో లేదా హై ప్రొఫైల్ లేడీ అనో అనుకుంటే మీరు పొరపడినట్టే! ఈమె అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్. 33 ఏళ్ల వయసులో ఢిల్లీ నేర సామ్రాజ్యానికి రాణిగా మారిన ఈమెను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. కోటి రూపాయల విలువైన మాదకద్రవ్యాలు తరలిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొన్నేళ్ల పాటు తెరవెనకే ఉంటూ నేర సామ్రాజ్యాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్న ఆమె ఎట్టకేలకు కటకటాల పాలైంది (Delhis Lady Don Zoya Khan Arrested).

న్యూఢిల్లీకి లేడీ డాన్‌గా మారిన ఈమె పేరు జోయా ఖాన్. చాలా కాలంగా పోలీసులు ఆమె అరెస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ వారి కంటే రెండడుగుల ముందే ఉంటూ జోయా తన పని కానిచ్చేసేది. ఢిల్లీ పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా జైలు పాలు కావడంతో ఆమె అతడి వారసురాలిగా రంగంలోకి దిగింది. అతడి గ్యాంగ్ కార్యకలాపాలను తన చెప్పుచేతల్లోకి తీసుకుంది. అసాధారణ తెలివితేటలు గల జోయా ఈ చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో తన పాత్ర కనిపించకుండా అని జాగ్రత్తలు తీసుకుంది. పోలీసులకు ఎటువంటి సాక్ష్యాలు దొరక్కుండా తెర వెనక నుంచే కథ నడిపించింది. ఆమెపై ఎన్ని అనుమానాలు ఉన్నా ఆధారాలు లేక పోలీసులు కేసు నమోదు చేయలేకపోయారు.

హషీమ్ బాబా మీద మాత్రం బోలెడన్ని కేసులు ఉన్నాయి. హత్య, బలవంతపు వసూల్లు, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమరవాణా ఇలా అనేక నేరాల్లో అతడి పాత్ర ఉంది. జోయా హషీమ్‌కు మూడో భార్య. మొదటి భర్తకు విడాకులిచ్చాక ఆమెకు 2017లో హషీమ్ పరిచయమయ్యాడు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఇరుగుపొరుగు ఉండే వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు.


USAID Funds: భారత ఎన్నికల్లో అమెరికా జోక్యంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రగడ

ఇక హషీమ్ బాబా జైలు పాలయ్యాక గ్యాంగ్ కార్యకలాపాలను జోయా చూసుకోవడం ప్రారంభించింది. గ్యాంగ్ సభ్యులకు ఆమె దావూద్ ఇబ్రహీం చెల్లెలుగా పరిచయం. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్ల దందాలో జోయాది చాలా కీలక పాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఇంత కరుడగట్టిన క్రిమినల్ అయినా జనాలకు ఆ ఛాయలేవీ కనబడనిచ్చేది కాదు. తానో హైప్రొఫైల్ మహిళగా బిల్డప్ ఇచ్చుకునేది. ప్రముఖుల పార్టీలకు హాజరవడం, ఖరీదైన దుస్తులు ధరించడం, విలాసవంతమైన కార్లు, వస్తువులను వినియోగిస్తూ గొప్పగా ఇమేజ్ మెయింటేన్ చేసుకునేది. తన లైఫ్‌స్టైల్‌ను తెలిపే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ భారీగా ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది.

మరోవైపు, గ్యాంగ్ నిర్వహణలో భర్త సాయం తీసుకునేది. నిత్యం ఆమె తీహార్ జైల్లోని భర్తను సందర్శించి వచ్చేది. గ్యాంగ్‌కు సంబంధించిన కార్యకలాపాల్లో జోయాకు భర్తే ట్రెయినింగ్ ఇచ్చాడని పోలీసులు తెలిపారు. వారి రహస్య కోడ్ భాష గురించి తర్ఫీదునిచ్చాడు. సలహాలు, సూచనలు కూడా ఇచ్చేవాడు. అతడి మార్గదర్శకత్వంలో ఆమె రాటుదేలింది. గ్యాంగ్‌పై పూర్తిగా పట్టుసాధించింది. భర్త పరిచయస్తులు, ఇతర క్రిమినల్స్‌తో లావాదేవీలు నెరపేది.

NDA : ఇక బెంగాల్‌ వంతు!


గ్యాంగ్ కార్యకలాపాల్లో ఆమె పాత్రపై ఢిల్లీ స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. ఈ మధ్యే వారు వెతుకుతున్న తీగ కాలికి తగిలింది. అత్యంత కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా పోలీసులు ఇటీవల నార్త్‌ఈస్ట్ ఢిల్లీలోని వెల్కమ్‌ ఏరియాలో ఆమెను డ్రగ్స్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న హెరాయిన్ యూపీ నుంచి తెప్పించుకున్నట్టు గుర్తించారు.

గతేడాది ఢిల్లీలోని నాదిర్ షా అనే జిమ్ నిర్వాహకుడి హత్య కేసులో షూటర్లకు జోయా ఆశ్రయం కల్పించి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

క్రిమినల్ ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్..

క్రిమినల్ సామ్రాజ్యంలో ఇలా సులువుగా ఇమిడిపోవడానికి జోయా నేపథ్యం ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జోయాది నేరస్థుల కుటుంబం. వ్యభిచారం రాకెట్ నిర్వహణకు సంబంధించి ఆమె తల్లి గతేడాదే అరెస్టైంది. ఇటీవల బెయిలుపై బయటకొచ్చింది. ఇక తండ్రికి కూడా వివిధ మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. నేరాల్లో ఆరితేరిన జోయా వెంట ఎప్పుడు గ్యాంగ్‌స్టర్లు ఉండేవారు.

ఇక నార్త్‌ఈస్ట్ ఢిల్లీ అంటేనే క్రిమినల్ గ్యాంగ్‌‌లకు అడ్డా. హషీమ్ బాబా గ్యాంగ్‌తో పాటు ఛెన్నూ గ్యాంగ్, నజీర్ పహిల్వాన్ గ్యాంగ్ తదితర అనేక క్రిమినల్ గ్యాంగులు ఈ ప్రాంతం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంటాయి. ఒకప్పుడు ఈ గ్యాంగులు కేవలం మాదకద్రవ్యాల అక్రమరవాణాకు పరిమితమైనా ఆ తరువాత వారి మధ్య వైరం హత్యలకూ దారి తీసింది. హషీమ్ బాబా గాంగ్ భారీగా డబ్బులు కూడబెట్టిందని, అదంతా ఇప్పుడు జోయా చేతుల్లోనే ఉందని తెలుస్తోంది. ఇక హషీమ్ బాబా గ్యాంగ్‌‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కూడా సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2025 | 12:26 PM