ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi High Court: కావాలంటే ప్రధాని మోదీ డిగ్రీని కోర్టుకు చూపిస్తాం

ABN, Publish Date - Feb 28 , 2025 | 04:29 AM

ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఆయన బి.ఎ. పాసయినట్లు రఽధువీకరించే సర్టిఫికెట్‌ను కోర్టుకు చూపించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు.

అభ్యంతరాలు ఏమీ లేవు.. ఢిల్లీ హైకోర్టులో సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ చదివిన డిగ్రీకి సంబంధించి గురువారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఆయన బి.ఎ. పాసయినట్లు రఽధువీకరించే సర్టిఫికెట్‌ను కోర్టుకు చూపించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు. ఆ సర్టిఫికెట్‌ను ఎవరైనా చూడవచ్చంటూ కేంద్ర సమాచార కమిషన్‌ (సి.ఈ.సి) జారీ చేసిన ఆదేశాలను మాత్రం తిరస్కరించాలని కోరారు. మోదీతో సహా 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పాసయిన బి.ఎ. విద్యార్థుల డిగ్రీల ఫలితాలను చూడవచ్చని 2016లో అప్పటి కేంద్ర ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ మాడభూషి శ్రీధరాచార్యులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీఐ కార్యకర్త నీరజ్‌ కుమార్‌ దాఖలు చేసిన దరఖాస్తుపై ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు అమలు కాకుండా 2017 జనవరి 24న ఢిల్లీ హెకోర్టు స్టే విధించింది. దీనిపై మళ్లీ న్యాయమూర్తి జస్టిస్‌ సచిన్‌ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా చేశారు.


మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్

For National News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 04:29 AM