ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Finance Minister : స్వయంగా చేతి రాతతో 100 పేజీల బడ్జెట్‌

ABN, Publish Date - Mar 10 , 2025 | 03:04 AM

ఛత్తీస్‌గఢ్‌ ఆర్థికమంత్రి ఓపీ చౌధరి తన స్వహస్తాలతో 100 పేజీల బడ్జెట్‌ ప్రతిని రాసి అసెంబ్లీకి సమర్పించారు.

  • అసెంబ్లీకి సమర్పించిన ఛత్తీస్‌గఢ్‌ ఆర్థికమంత్రి

రాయ్‌పూర్‌, మార్చి 9: ఏఐ చాట్‌బోట్‌తో ఏ పనినైనా చిటికెలో పూర్తిచేస్తున్న ఈ రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌ ఆర్థికమంత్రి ఓపీ చౌధరి తన స్వహస్తాలతో 100 పేజీల బడ్జెట్‌ ప్రతిని రాసి అసెంబ్లీకి సమర్పించారు. ఐఏఎస్‌ అధికారి అయిన చౌధరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2018లో తన కలెక్టర్‌ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2023 ఎన్నికల్లో బీజేపీ తరఫున రాయ్‌గఢ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 100 పేజీలున్న ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిని తన స్వహస్తాలతో హిందీలో రూపొందించిన ఆయన, మార్చి 4న అసెంబ్లీలో సమర్పించారు. ఈ క్రమంలో బడ్జెట్‌ సమర్పణకు పది రోజుల ముందు నుంచి తాను రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రించానని తెలిపారు. కాగా, ఓ ఆర్థికమంత్రి స్వయంగా తన చేతితో రాసిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం దేశచరిత్రలో బహుశా ఇదే మొదటిసారి.

Updated Date - Mar 10 , 2025 | 03:04 AM