USAID Funds: భారత ఎన్నికల్లో అమెరికా జోక్యంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రగడ
ABN, Publish Date - Feb 21 , 2025 | 08:45 AM
భారత్‌లో ఓటింగ్‌ను ప్రభావితం చేసేందుకు అమెరికా నిధులు ఖర్చై ఉండొచ్చన్న డొనాల్ట్ ట్రంప్ ఆరోపణలు భారత్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పరస్పర విమర్శలు మొదలయ్యాయి.
భారత్‌లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించిన ఉండొచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేయడంభారత్‌లో సంచలనానికి దారి తీసింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య మరో వివాదాన్ని రాజేసింది. విదేశీ నిధులతో కాంగెస్ 2014 నాటి ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎన్నికను అడ్డుకునేందుకు ప్రయత్నించిందంటూ బీజేపీ ఆరోపించింది. అయితే, ట్రంప్ వాదనలు అర్థరహితమన్న కాంగ్రెస్.. విదేశీ నిధులపై ప్రభుత్వమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
గత బైడెన్ ప్రభుత్వం భారత్‌లో ఎన్నికల కోసం 21 మిలియన్ డాలర్లు కేటాయించడంపై డొనాల్డ్ ట్రంప్ పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసింది. ‘‘అక్కడ ఎవరో ఎన్నిక కావాలని ప్రయత్నం చేసినట్టు ఉంది’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ప్రభుత్వానికి 204.28 మిలియన్ డాలర్ల నిధులు అందాయని, ఇక దేశంలోని ఎన్‌జీఓలకు 2114.96 మిలియన్ డాలర్లు నిధులు అందాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఎన్డీయే అధికారంలోకి వచ్చాక నిధుల రాకడ తగ్గిందని చెబుతున్నాయి. 2015 నాటికి ప్రభుత్వానికి అందిన నిధులు 1 మిలియన్ డాలర్లకు పడిపోయాయని, కానీ ఎన్జీఓలకు నిధులు మాత్రం 2579.73 డాలర్లు చేరాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
‘‘మోదీ ప్రధాని అయ్యాక, భారత్‌లోని ఎన్జీఓలకు, ఇతర వేదికలకు విదేశీ నిధుల రాకడ భారీగా పెరిగింది. నేరుగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే బదులు భారత వ్యతిరేక జాతీ వ్యతిరేక వేదికలకు నిధుల రాకడ పెరిగింది’’ అని బీజేపీ వర్గాలు ఆరోపించాయి.
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
కాగా, ఈ వాదనను కాంగ్రెస్ సీనియర్ నేత జయరామ్ రమేశ్ కొట్టిపారేశారు. ‘‘ఈ మధ్య కాలంలో యూఎస్ఏఐడీ వార్తల్లో ఎక్కువగా కనిపిస్తోంది. 1961 నవంబర్ 3న ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక ట్రంప్ చేసిన ఆరోపణలు అర్థరహితం. అయినా కూడా ప్రభుత్వం.. యూఎస్ఏఐడీ నిధులు ఎవరెవరికీ అందాయనే వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని ఎక్స్ వేదికగా జైరామ్‌రమేశ్ డిమాండ్ చేశారు.
ఫబ్రవరి 16న అమెరికా డోజ్ శాఖ ప్రకటనతో యూఎస్ఐఐడీ నిధుల అంశం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. పొదుపు చర్యల్లో భాగంగా భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తున్నట్టు డోజ్ శాఖ పేర్కొంది. దీంతో, ఈ నిధులు భారత్లో ఎవరికి చేరాయో తేలాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి,
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Feb 21 , 2025 | 08:46 AM