Karnataka: కర్ణాటకలో బర్డ్ ఫ్లూ.. రాష్ట్రమంతా హై అలర్ట్
ABN, Publish Date - Mar 01 , 2025 | 06:12 AM
కర్ణాటకలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ కావడంతో రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించారు. బెంగళూరు నగరానికి సమీపంలో ఉండే చిక్కబళ్లాపుర తాలూకాలో ఇంతవరకు 36 కోళ్లు మృతి చెందాయి.
బెంగళూరు, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ కావడంతో రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించారు. బెంగళూరు నగరానికి సమీపంలో ఉండే చిక్కబళ్లాపుర తాలూకాలో ఇంతవరకు 36 కోళ్లు మృతి చెందాయి. బళ్లారి జిల్లా సండూరు, రాయచూరు జిల్లా మాన్వి తాలూకా పరిధిలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి మృత్యువాత పడుతున్నాయి. బెంగళూరులో శుక్రవారం వైద్యశాఖ అధికారుల ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రమంతటా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచించారు. మనుషులకి ఎక్కడా బర్డ్ ఫ్లూ సోకిన దాఖలాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.
Updated Date - Mar 01 , 2025 | 06:12 AM